పార్టీకి, నాకు సంబంధం లేదు: షర్మిల భర్త అనిల్

0 13

విజయవాడ  ముచ్చట్లు:

 

ఏపీలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల పార్టీ పెట్టడంపై ఇటీవల ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. నేడు షర్మిల భర్త అనిల్ సైతం ఏపీలో పార్టీపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అవునని కానీ కాదని కానీ చెప్పకుండా సమాధానాన్ని దాటవేశారు. నేడు గన్నవరం ఎయిర్ పోర్టుకు బ్రదర్ అనిల్ చేరుకోగా.. ఆయనను మీడియా ఏపీలో షర్మిల పార్టీ ఏర్పాటుపై ప్రశ్నించింది. తాను విజయవాడలో చిన్న ఫంక్షన్ ఉండి వచ్చానని.. తనకు ఇక్కడ ఏమి పని లేదన్నారు. షర్మిల ఏపీలో పార్టీ పెడుతున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘పార్టీకి, నాకు సంబంధం లేదు. నేను పార్టీ గురించి మాట్లాడను’ అని బ్రదర్ అనిల్ సమాధానమిచ్చారు.

- Advertisement -

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి

Tags: To the party, I have nothing to do: Sharmila’s husband Anil

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page