శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా భోగితేరు

0 2

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం భోగి పండుగ ఏకాంతంగా జ‌రిగింది. ఇందులోభాగంగా ఉద‌యం తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి ధ‌నుర్మాస కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఆ త‌రువాత స‌హ‌స్ర‌నామార్చ‌న చేప‌ట్టారు. సాయంత్రం శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని,  శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా చేప‌ట్టారు.ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో  రాజేంద్రుడు, ఏఈవో  ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్లు  వెంకటాద్రి,  నారాయ‌ణ‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు  కామ‌రాజు,  ధనుంజయ్ పాల్గొన్నారు.

- Advertisement -

సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష

Tags: Bhogitheru in solitude in the temple of Sri Govindarajaswamy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page