Natyam ad

భ‌క్తుల‌కు అందుబాటులో 2023 టిటిడి డైరీలు, క్యాలెండ‌ర్లు

– ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు

– డిడి తీసి పంపినా పొందవచ్చు

 

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

టిటిడి ప్రతిష్టాత్మకంగా ముద్రించిన 2023వ  సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులో ఉన్నాయి.తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా, లేపాక్షి ఎదుట, అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలలతోపాటు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం వద్దగల ధ్యానమందిరం, రైల్వేస్టేషన్‌, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు ఉన్నాయి. విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టిటిడి సమాచార కేంద్రాల్లోనూ క్యాలెండర్లు, డైరీలను టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది.అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, హనుమకొండలోని టిటిడి కల్యాణమండపాల్లో అందుబాటులో ఉన్నాయి.

ధరలు ఇలా ఉన్నాయి…

– 12 పేజీల క్యాలెండర్ రూ.130/-,

– డీలక్స్ డైరీ రూ.150/-,

– చిన్న డైరీ రూ.120/-,

– టేబుల్‌ టాప్‌ క్యాలెండర్ రూ.75/-,

– శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20 /-,

– శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.20 /-,

– శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15 /-,

– తెలుగు పంచాంగం క్యాలెండర్ – రూ.30/-.

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు

టిటిడి క్యాలెండర్లు, డైరీలను భక్తులు ఆన్‌లైన్‌లోనూ బుక్‌ చేసుకుంటున్నారు. భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో ”పబ్లికేషన్స్‌”ను క్లిక్‌ చేసి డెబిట్‌కార్డు, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చు. టిటిడి క్యాలెండర్లు, డైరీలు త‌పాలా శాఖ ద్వారా ఇంటి వద్దకే వచ్చి చేరుతుండడంతో ఎక్కువ మంది భక్తులు ఉత్సాహంగా బుక్‌ చేసుకుంటున్నారు.

డిడి తీసి పంపొచ్చు…

భక్తులు డిడి తీసి పంపినా టిటిడి క్యాలెండర్‌, డైరీలను పొందవచ్చు. ఇందుకోసం ”కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి” పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి కవరింగ్‌ లెటర్‌తో కలిపి ”ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, కెటి.రోడ్‌, తిరుపతి” అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ప్రయివేటు ట్రాన్సుపోర్టు ద్వారా భక్తులకు టిటిడి క్యాలెండర్‌, డైరీలను పంపడం జరుగుతుంది. రవాణా ఛార్జీలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.క్యాలెండర్‌, డైరీలకు సంబంధించిన ఇతర సమాచారం కోసం 9963955585, 0877-2264209 నంబర్లలో సంప్రదించవచ్చు.

Tags: 2023 TTD diaries, calendars available for devotees

Post Midle