2024-25 డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.

నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

అమరావతి ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపులు జులై 2 (మంగళవారం) నుంచి ప్రారంభమయ్యాయి. జులై 10 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. జూలై 4వ తేదీ నుంచి ఆరో తేదీ వరకు స్పెషల్ క్యాటగిరీ విద్యార్ధులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. జూలై 5వ తేదీ నుంచి హెల్ప్‌లైన్‌ సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫకేషన్ నిర్వహిస్తారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు జులై 11 నుంచి 15 వరకు అవకాశం కల్పించారు. జులై 19 న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 20 నుంచి 22వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయవల్సి ఉంటుంది. ఎన్‌సీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడాకారులు ధ్రువపత్రాల పరిశీలనకు ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ- విజయవాడ, డాక్టర్‌ వీఎస్‌ కృష్ణ కాలేజీ-విశాఖపట్నం, ఎస్వీ విశ్వ విద్యాలయం -తిరుపతిలో సహాయ కేంద్రాలకు హాజరుకావాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి తెలిపింది.డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు గుర్తింపు పొందిన బోర్డుల బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, సోషల్ వర్క్ వంటి పలు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు పొందేందుకు వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. B.A, B.Sc, B.Com, BBA, B.Voc, B.F.A కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ఇంజనీరింగ్, ఫార్మసీ స్ట్రీమ్‌లు మినహా మిగతా కోర్సులకు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌లలో కూడా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ విద్యార్ధులు రూ.400, బీసీ విద్యార్ధులు రూ.300, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలు అడ్మిషన్ నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

 

 

 

Tags:2024-25 Degree Online Admissions Counseling Schedule Released.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *