2024 క్యాలెండర్లు వచ్చేశాయ్
తిరుమల ముచ్చట్లు:
2024 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను విడుదల చేసింది టీటీడీ. ఈ మేరకు పలు నగరాల్లో అందుబాటులోకి తీసుకువచ్చిన్నట్లు ప్రకటించింది.టీటీడీ క్యాలెండర్లు వచ్చేశాయి. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టీటీడీ ముద్రించిన 2024వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో భక్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అదేవిధంగా, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా 12 పేజీల క్యాలెండర్లు, డైరీలు, టేబుల్ టాప్ క్యాలెండర్లను భక్తులు కొనుగోలు చేయవచ్చని వివరించింది.12 పేజీల క్యాలెండర్ – రూ.130/-, డైరీ(డీలక్స్) రూ.150/-, డైరీ(చిన్న)రూ.120/-, టేబుల్ టాప్ క్యాలెండర్ రూ.75/-, 6 పేజీల క్యాలెండర్ రూ.450/-, శ్రీ వేంకటేశ్వరస్వామి పెద్ద క్యాలెండర్ రూ.20/-, శ్రీవారు మరియు శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15/-, శ్రీ పద్మావతి పెద్ద క్యాలెండర్ రూ.20/-, తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.30/-.చెన్నైలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలు, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో క్యాలెండర్లు, డైరీలు విక్రయాల కోసం అందుబాటులో ఉన్నాయి.
Tags: 2024 calendars have arrived

