208 self-imprisonment

208 మందికి స్వీయ నిర్భంధం

Date:27/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

కర్నాటక నుంచి కాలినడకన మండలంలోని వివిధ గ్రామాలకు వచ్చిన 208 మందిని స్వీయ నిర్భంధం చేసినట్లు ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు తెలిపారు. శుక్రవారం మండలంలోని ఆరడిగుంట కురప్పల్లెకు చెందిన 135 మంది వంట కార్మికులు, కురవచీరుకు చెందిన 29 మంది, జౌకొత్తూరుకు చెందిన 42 మంది, కిలకీరికి చెందిన ఇద్దరు కర్నాటకలో పనులు చేస్తారు. గురువారం రాత్రి గ్రామాలకు చేరారు. సమాచారం అందుకున్న ఎంపీడీవో , సీఐ గంగిరెడ్డి , తహశీల్ధార్‌ వెంకట్రాయులు కలసి ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజలంతా ఇంటిలోనే ఉండేలా స్వీయ నిర్భంధం నోటీసులు జారీ చేసి, సచివాలయ ఉద్యోగులను, వలంటీర్లను పర్యవేక్షణకు నియమించారు. విషయం తె లుసుకున్న ఎంపీ రెడ్డెప్ప, పార్టీ నేతలు అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వెంకటరెడ్డి యాదవ్‌, చంద్రారెడ్డి యాదవ్‌ గ్రామాలను సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు.

పోలీసులకు, కార్మికులకు భోజనం పంపిణీ 

Tags: 208 self-imprisonment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *