ఆనకట్టల పునరుద్దరణకు రూ.21.09 కోట్లు

Date:03/12/2020

పుంగనూరు ముచ్చట్లు:

నియోజకవర్గంలోని చౌడేపల్లె, పుంగనూరు మండలాల్లో ప్రవహిస్తున్న కౌండిన్య నదిపై నిర్మించిన ఆనకట్టల పునరుద్దరణ, సురక్షిత గోడ నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.21.09 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు మండలాల్లో కౌండిన్య నదిపై ఆనకట్టల నిర్మాణం జరిగింది. చాలాకాలంగా వీటి పునరుద్దరణ జరగలేదు. దీనితో నీటి వృధా అధికమైంది. అలాగే పుంగనూరు పట్టణంలో నది కారణంగా దోమల బెడద ఎక్కువై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టి సారించారు. పుంగనూరుకు రక్షణ గోడ నిర్మాణం, అనకట్టలను పునరుద్దరించి నీటినిల్వ కోసం పనులు చేపట్టేందుకు నిధులు మంజూరుకు కృషి చేశారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 ఢిల్లీ రైతులకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ

Tags: 21.09 crore for the rehabilitation of dams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *