22 నుంచి అంతరాష్ట్ర కబడ్డీ పోటీలు

22nd Interstate Kabaddi Competitions

22nd Interstate Kabaddi Competitions

Date:17/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని బిఎంఎస్‌క్లబ్‌లో ఈనెల 22 నుంచి అంతరాష్ట్ర కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు రామచంద్ర సోమవారం తెలిపారు. 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు 21న శుక్రవారంకు పుంగనూరు చేరుకోవాలన్నారు. పోటీలు 22నుంచి 24 వరకు మూడు రోజుల పాటు జరుగుతుందన్నారు.

 

పుంగనూరు కబడ్డీ క్రీడాకారుడు దివంగత మారిశెట్టి జ్ఞాపకార్థం ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీడాకారులకు వసతి, భోజన ఏర్పాట్లు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులతో పాటు శిక్షకులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.

 

రాష్ట్ర స్థాయి పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పట్టణ పెద్దలు రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్‌, కమిషనర్‌ కెఎల్‌.వర్మ, ఒలంపిక్‌ సంఘ కార్యదర్శి గిరిధర్‌ తోపాటు వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు , వ్యాపారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

కోర్టులు బహిష్కరణ

Tags: 22nd Interstate Kabaddi Competitions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *