23 నియోజకవర్గాలపై దృష్టి

Date;27/02/2020

నియోజకవర్గాలపై దృష్టి

కాకినాడ, ముచ్చట్లు

రాష్ట్రంలో ఎంత సునామీ సృష్టించి అధికారంలోకి వ‌చ్చినా చాలా మేర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ పుంజు కోవాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రీ ముఖ్యంగా టీడీపీ గెలిచిన 23 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ ఓట‌మికి గ‌ల కారణాలు, పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గమే తూర్పుగోదావ‌రి జిల్లాలోని పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గం. ఇక్కడ వైసీపీ ఎదురీదు తోంది. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్కడ అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటి వ‌ర‌కు టీడీపీలో ఉన్న కాకినాడ ఎంపీ తోట న‌రసింహం వైసీపీలోకి వ‌చ్చారు.ఆవెంట‌నే త‌న భార్య వాణికి పెద్దాపురం టికెట్‌ను ఇప్పించుకుని పోటీ చేశారు. నిజానికి ఈ టికెట్ ర‌గ‌డ విషయంతోనే తోట ఫ్యామిలీ టీడీపీకి గుడ్ బై చెప్పింది. వైసీపీ నుంచి టికెట్ ద‌క్కించుకున్నా.. ఎన్నిక‌ల్లో మా త్రం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హ‌వా క‌నిపించినా.. ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి నిమ్మకాయ‌ల చిన్నరాజ‌ప్ప విజయం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లో తోట వాణిపై చిన‌రాజ‌ప్ప 4 వేల ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. దీంతో ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న వాణి ప‌రిస్థితి అగ‌మ్యంగా మారింది. ఈ క్రమంలోనే పార్టీలోనో లేదా నామినేటెడ్‌గానో ఎమ్మెల్సీనో మ‌రొక‌టో ఇవ్వాల‌ని ఆమె వైసీపీని అభ్యర్థించారు.అయితే, ఇప్పటికే చాలా మంది సీనియ‌ర్లు ప‌ద‌వుల కోసం ఎదురు చూస్తున్నార‌ని, అదే స‌మ‌యంలో టికెట్లు త్యాగాలు చేసిన వారికి కూడా ప‌ద‌వులు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వైసీపీ సీనియ‌ర్లు సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి వారు చెప్పారు. దీంతో వాణి అప్పటి నుంచి బెదిరింపులకు దిగారు. అయినా కూడా ఫ‌లితం ద‌క్కలేదు. ఇదిలావుంటే పెద్దాపురం వైసీపీ ఇంచార్జ్‌గా ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ప‌నిచేసిన ద‌వులూరి దొర‌బాబును నియ‌మించారు.అయితే, ఇక్కడ బ‌ల‌మైన నాయ‌కుడిగా చిన్నరాజ‌ప్ప ఉండడం, త్వర‌లోనే సామ‌ర్లకోట, పెద్దాపురం మున్సిపాల్టీల ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమ‌వుతుండ‌డంతో ఎంత మేర‌కు దొర‌బాబు వైసీపీని ప‌రుగులు పెట్టిస్తార‌నేది సందేహంగా మారింది. వాణి అనుచ‌రులు క‌లిసివ‌స్తారా? అనేది కూడా సందేహంగానే మారింది. అదే టైంలో టీడీపీలో అసంతృప్త నేత‌గా ఉన్న బొడ్డు భాస్కరరామారావు సైతం వైసీపీకి ఇన్ డైరెక్టుగా స‌పోర్ట్ చేస్తున్నార‌న్న టాక్ ఉంది. ఏదేమైనా కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీని నాయ‌క‌త్వ స‌మ‌స్య వెంటాడుతోంది. మ‌రి జ‌గ‌న్ దొర‌బాబునే కంటిన్యూ చేస్తారా ? లేదా ? మ‌ధ్యలోనే కొత్త నాయ‌కుడిని తెర‌మీద‌కు తెస్తారా ? అన్నది చూడాలి.

 

Tags;23 Concentration on Constituencies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *