23 నుండి వసంత మండపంలో కార్తీకమాస విష్ణుపూజలు
తిరుమల ముచ్చట్లు:
లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పవిత్రమైన కార్తీక మాసంలో తిరుమల వసంత మండపంలో శ్రీమహావిష్ణువుకు సంబంధించిన పూజలు వైఖానసాగమబద్ధంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ఈ పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
– నవంబరు 23న గురువారం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు విష్ణుసాలగ్రామ పూజ.

– నవంబరు 24న శుక్రవారం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు కైశికద్వాదశి – శ్రీ తులసీ దామోదర పూజ.
– నవంబరు 29న బుధవారం ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు గోపూజ.
– డిసెంబరు 10న ఆదివారం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు ధన్వంతరి జయంతి.
Tags: 23 to Kartikamasa Vishnu Pujas in Vasantha Mandapam
