Natyam ad

పుంగనూరు మున్సిపాలిటిలో రూ.20కోట్లతో 230 పనులు – కమిషనర్‌ నరసింహప్రసాద్‌

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటిలోని 31 వార్డులలోను రూ.20 కోట్ల రూపాయలతో 230 పనులు చేపట్టనున్నట్లు కమిషనర్‌ నరసింహప్రసాద్‌ తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డివెంకటమిధున్‌రెడ్డిలు కలసి ప్రత్యేకంగా మున్సిపాలిటికి రూ.20 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని తెలిపారు. ఈ నిధులతో పట్టణంలోని అన్ని వార్డులలోను కాలువలు, వీధులు, పైపులైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో 115 రోడ్లు, 85 మురుగునీటి కాలువలు, 25 పైపులైన్లు, బోర్లు, మరో 5 పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే ప్రధాన వీధుల్లో తారురోడ్లు ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్‌ తెలిపారు. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలిచి,పనులు చేపడుతామన్నారు. పట్టణంలోని విస్తర్ణ ప్రాంతాలలో సైతం రోడ్లు, కాలువలు, పైపులైన్లు ఏర్పాటు చేసే కార్యక్రమం పూర్తి అవుతుందన్నారు. ఈ విషయంలో కౌన్సిలర్లు ఆయా ప్రాంతాలలో నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయించాలని కోరారు. పట్టణంలోని ఎంబిటి రోడ్డును విస్తరించే కార్యక్రమం చేపట్టామన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు కౌండిన్యనది కాలువలో సిమెంటు కాలువలు నిర్మాణం, రూ.22 కోట్లతో జరుగుతోందన్నారు. రూ.3 కోట్లతో పుంగమ్మ చెరువు కట్టవద్ద సుందరమైన పార్కును నిర్మిస్తున్నట్లు తెలిపారు.

 

Post Midle

Tags: 230 works with Rs.20 crore in Punganur Municipality – Commissioner Narasimhaprasad

Post Midle