24, 25 దసరా సెలవులు

Date:22/10/2020

విజయవాడ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లో దసరా ఉత్సవాలు ప్రారంభమైపోయాయి. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలంతా ఇళ్లలోనే ఉండటంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. అయితే అన్ లాక్ 5.0లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలన్నీ ప్రారంభమైపోయాయి. ఉద్యోగులు యథావిధిగా డ్యూటీలకు హాజరవుతున్నారు. జనజీవనం కూడా దాదాపు సాధారణ స్థితికి వచ్చేసింది.దాదాపు 5 నెలలుగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో సెలవులతో పెద్దగా పని పడలేదు. అన్ని రోజులనూ ఒకేలా ఎంజాయ్ చేశారు. అయితే ఆఫీసులు ప్రారంభం కావడం, ఇతర కార్యకలాపాలు పుంజుకోవడంతో జనాలు సెలవుల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఈ తరుణంలో దసరా పండుగ విషయం.. సెలవు దినంపై వివిధ వార్తలు షికారు చేశాయి.వాస్తవానికి 2019లోనే ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 25వ తేదీ అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేసింది. అయితే తిధి, పంచాంగం ప్రకారం ఈ ఏడాది దసరా అక్టోబర్ 26వ తేదీకి మారుస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తొలుత ప్రకటించడంతో పండుగ విషయంలో గందరగోళం నెలకొంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. తర్వాత తెలంగాణ సర్కారు కూడా ఆ సర్క్యులర్‌ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.దీంతో పండుగల విషయంలో ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది. ఈ నెల 24వ తేదీ (శనివారం) దుర్గాష్టమి పండుగ సందర్భంగా ప్రభుత్వ సాధారణ సెలవు ఉంటుంది. తర్వాతి రోజు అంటే ఈ నెల 25వ తేదీ (ఆదివారం) విజయదశమి (దసరా) పండుగ వస్తుంది. అంటే 24, 25 రెండు రోజులు వరుస సెలవు దినాల్లో ప్రజలు ‘పండుగ చేసుకోవచ్చు’.

నవంబర్ 28 న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష

Tags; 24, 25 Dussehra holidays

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *