25 శాతం కేటాయింపు
విజయవాడ ముచ్చట్లు:
ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థుల కేటాయించే సీట్ల విషయమై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు పాఠశాలల్లో పేదల కోసం 25 శాతం కేటాయిస్తామని తెలిపింది. ఈ విషయమై ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పేదలకు సీట్లను కేటాయించాలని తాండవ యోగేష్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా కేంద్రం నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద వర్గానికి చెందిన విద్యార్థులకు సీట్లను కేటాయించాలని న్యాయ స్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. అయితే ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఉన్న కారణంగా ఇప్పటికిప్పుడు నిబంధనలను అమల్లోకి తీసుకురాలేమని, వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచి సీట్ల కేటాయింపు అమల్లోకి వస్తుందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో కార్పొరేట్ విద్యా సంస్థల్లో పేద వర్గానికి చెందిన విద్యార్థులకు కూడా అవకాశం లభిస్తుందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల ఫీజులపై గతంలో విద్యాశాఖ విడుదల చేసిన జీఓలను ఏపీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. చట్టానికి, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జీవో ఇచ్చారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఏపీలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లు, జూ.కాలేజీలకు ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది. కాలేజీలు, స్కూల్స్ నుంచి ప్రతిపాదనలు తీసుకొని ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: 25 per cent allocation