26న  అవిశ్వాసం చర్చ దిగొచ్చిన కేంద్రం

TDP at work

TDP at work

 Date:18/07/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. అవిశ్వాసంపై చర్చకు సిద్ధమైంది. శుక్రవారం నాడు లోక్ సభలో అవిశ్వాసంపై చర్చను చేపట్టనున్నట్టు స్పీకర్ కార్యాలయం తెలిపింది. ప్రశ్నోత్తరాలను కూడా రద్దు చేసి, సాయంత్రం వరకు అవిశ్వాసంపై చర్చ జరపనున్నట్టు వెల్లడించింది.ఏపీ జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదించారు. దీనిపై శుక్రవారం చర్చ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ రోజు ప్రశ్నోత్తరాలు రద్దు చేసి అవిశ్వాసంపై చర్చ చేపడతామని వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం ఏపీ విభజన చట్టంపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చర్చ సందర్భంగా ఏయే పార్టీకి ఎంత సమయం ఇవ్వాలనే విషయాన్ని కాసేపట్లో స్పీకర్ ఖరారు చేయనున్నారు. తమకు నాలుగు గంటల సమయం కావాలని టీడీపీ కోరింది. అయితే, రెండు గంటల సమయం ఇస్తామని, వెసులుబాటును బట్టి సమయాన్ని పెంచే ప్రయత్నం చేస్తామని స్పీకర్ చెప్పినట్టు సమాచారం. మరోవైపు రానున్న సోమవారం నాడు విభజన చట్టంపై రాజ్యసభలో చర్చ జరగనుంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని.. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బుధవారం సభ ప్రారంభమవగానే టీడీపీ ఎంపీల అవిశ్వాస తీర్మానం అందిందని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. దాన్ని సభ ముందు ఉంచారు. తీర్మానంపై చర్చకు 50 మందికిపైగా సభ్యులు మద్దతుగా లేచి నిలబడటంతో స్పీకర్‌ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. చర్చపై తేదీని బీఏసీ సమావేశంలో ఖరారు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై  పార్లమెంట్‌లో టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. రెండుమూడు రోజుల్లో చర్చకు సంబంధించిన తేదీలు వెల్లడిస్తామని ఆమె తెలిపారు. అయితే 2003 తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ స్వీకరించడం ఇదే మొదటిసారి. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అయితే సాధారణంగా అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలంటే దానికి 50 మంది ఎంపీల మద్దతు కావాలి. అవిశ్వాసంపై చర్చిస్తామని కూడా కేంద్రమంత్రి అనంత్‌కుమార్ స్పష్టం చేశారు. 2003లోనూ అప్పటి బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు. అప్పుడు ఆ తీర్మానాన్ని స్వీకరించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ర్టాల ఎన్నికలకు ముందు ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఆ తీర్మానంలో విపక్షాలు ఓడిపోయాయి. 1999లో వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ కూటమి విశ్వాస తీర్మానంలో ఓటమిపాలైంది. జయలలితకు చెందిన అన్నాడీఎంకే పార్టీ మద్దతు ఉపసంహరించడంతో వాజ్‌పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఒకే ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వం ఆ ఓటింగ్‌లో ఓడిపోయింది.దాదాపు పదిహేనేళ్ల తర్వాత లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించారు. చివరి సారిగా 2003లో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అది 314-189 ఓట్ల తేడాతో వీగిపోయింది. మళ్లీ 15 ఏళ్ల తర్వాత మరోసారి నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ భుత్వంపైనే ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హామీలు అమలు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. శుక్రవారం ఈ అవిశ్వాసంపై చర్చ చేపట్టనున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన తెలిపారు.2014 సార్వత్రిక ఎన్నికల నుంచి మోడీ హవా కొనసాగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని రాష్ట్రాలలో తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇక ప్రాంతీయ పార్టీలు కూడా బాగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని పలు అంశాలపై విపక్షాలు దాదాపు ఏకమై మోడీని టార్గెట్ చేస్తున్నాయి. అందుకు యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూటమి, బీహార్‌లో (ఇటీవలి వరకు) ఆర్జేడీ, జేడీయు కూటమి నిదర్శనం.మరోవైపు, అప్రహతికంగా దూసుకుపోతున్న మోడీని, బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతి అంశాన్ని ఉపయోగించుకునేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ అవిశ్వాసంతో మోడీ అనుకూలురు ఎవరు, వ్యతిరేకులు ఎవరో తేలిపోతుందని అంటున్నారు. ఈ అవిశ్వాసంతో రాజకీయ రంగులు బయటపడతాయని అంటున్నారు. అవిశ్వాసంపై మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారు ఉత్సాహంతో ఉన్నారు. బీజేపీ కన్నా తామే నయమని కాంగ్రెస్ చెబుతోంది. ఏపీకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని చెబుతోంది.పదిహేనేళ్ల తర్వాత అవిశ్వాసం అంశం చర్చకు వస్తోంది. 2003లో సోనియా గాంధీ నాటి వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నాడు కూడా దాదాపు ఏడాదికి ముందు అవిశ్వాసం ప్రవేశపెట్టగా, ఇప్పుడు ఏడాది ముందు టీడీపీ ప్రవేశపెట్టింది.
26న  అవిశ్వాసం చర్చ దిగొచ్చిన కేంద్రం https://www.telugumuchatlu.com/26th-anniversary-of-disbelief-discussion/
Tags:26th Anniversary of Disbelief Discussion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *