27 నుండి 29వ తేదీ వరకు శ్రీ సుందరరాజస్వామి వార్షిక అవతారమహోత్సవాలు

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్నశ్రీసుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు జూన్ 27 నుండి 29వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.ఈ మూడు రోజుల పాటు మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల వరకు శ్రీ సుందరరాజస్వామివారికి ఊంజల్‌ సేవ జరుగుతుంది. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహన సేవ నిర్వహిస్తారు.శ్రీసుందరరాజస్వామివారు మొదటి రోజు పెద్దశేష వాహనం, రెండో రోజు హనుమంత వాహనం, చివరిరోజు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజ‌ల్ సేవను టీటీడీ రద్దు చేసింది.

 

Tags:27th to 29th Annual Incarnation Festivals of Sri Sundararajaswamy

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *