మహాకూటమిలో 28 మంది జంప్ జిలానీలు….

28 jalanis in the mahoututham ....

28 jalanis in the mahoututham ....

సీట్లకై ఒత్తిడి తెస్తున్న మూడు పార్టీల నేతలు
Date:08/10/2018
హైద్రాబాద్, అక్టోబరు 8, (న్యూస్ పల్స్)
మహా కూటమిలో సీట్ల పంపకంపై ఎటూ తేలకపోవడంతో టికెట్లు ఆశించే అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలరోజుల నుంచి చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఇప్పటి వరకు కొలిక్కి రాకపోవడంపై పార్టీ అధినేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీట్ల కేటాయింపు త్వరగా చేపట్టకపోతే మా దారి మేం చూసుకుంటామని అధిష్టానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అధినేత సెప్టెంబర్ 6న ప్రభుత్వం రద్దు చేసి అదే రోజు ఊహించని విధంగా 105మంది అ భ్యర్థ్దులను ప్రకటించి విపక్షాలను గందరగోళంలో పడేశారు.
మరుసటి రోజు నుంచే బరిలో నిలిచే వారంతా తమ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ప్రచారానికి తెర లేపి గ్రామాల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సీపీఐ పార్టీల  నియోజ కవర్గాల ఇన్‌చార్జిలు ప్రచారంలో వెనకబడిపోతామని మథన పడుతున్నారు. గులాబీ సైన్యం ఉద్యమ కారుల చిత్రాలను ముందుపెట్టుకుని తామే నిజమైన తెలంగాణ సమరయోధు లమని ఊదర గొడుతూ ఉంటడంతో ఉద్యమకాలంలో తెగించి పనిచేసిన తాము ఇంకా సీట్ల కోసం  పైరవీలు చేయడం వంటి పనుల్లో ఉండటం జీర్ణించు కోలేకపోతున్నా మని చెబుతున్నారు.
దీనికి తోడు కూటమిలో కాంగ్రెస్  పెద్దపార్టీగా ఉండటంతో మిత్ర పక్షాలకు 18సీట్లు ఇచ్చి, వారు మాత్రం 101 స్థ్దానాల్లో ఉంటామని లీకులు చేయడం పొత్తుల్లో న్యాయం ఎక్కడ జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. టీడిపి 25సీట్లు, టీజెఎస్ 20, సీపీఐ 8 సీట్లు  కావాలని జాబితాను టీపీసీసీ నాయకులకు అందజేశారు. ఇచ్చి వారంరోజులు గడుస్తున్న సర్వే చేయించి గెలిచే అభ్యర్థలను తామే గుర్తించి ప్రకటన చేస్తామనడం సమం జసం కాదంటున్నారు. మరోపక్క టీఆర్‌ఎస్ 14సీట్లను పెండింగ్‌లో పెట్టింది. వాటిలో కూడా రేపోమాపో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
ఈ లోగా తమ అభ్యర్థిత్వం ఖరారు చేయ కుంటే గులాభీ దారిపడుతామని టీడీపీ, టీజెఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. గోషామహల్, మేడ్చల్, మల్కాజిగిరి, మలక్‌పేట, అంబర్‌పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, చొప్ప దండి, కోదాడ, హుజూర్‌నగర్,వరంగల్ ఈస్ట్, వికారాబాద్ వంటి చోట్ల ఇతర పార్టీలకు చెందిన బలమైన అభ్యర్థులను పార్టీలో చేర్చుకుని వారికి కట్టబెట్టేందుకు వ్యుహాలు రచి స్తుంది.అందులో భాగంగా మేడ్చల్, మల్కాజిగిరి, కోదాడ, వికారా బాద్, చొప్పదండి, గోషామహల్ ,ముషీరాబా ద్‌లకు చెందని టీజెఎస్, టీడిపి ఆశావాహులతో ఆపార్టీ నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.
మహాకూట మిలో టికెట్ రాకుండా వెంటనే గులాబీ కండు వా కప్పుకుంటామని చెప్పినట్లు వారి అనుచరులు గుసగు సలా డుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని పేర్కొనడం చూ స్తూంటే తమకు టికెటు రాకుండా దారులు మూసుకునేలా ప్రయ త్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. మూడు రోజుల్లో పొత్తులపై తేల్చకుంటే తమ దారి చూసుకుంటామని పార్టీ అధినేతలకు సూచిస్తున్నారు.
టీడీపీకి 10, టీజెఎస్ 4, సీపీఐ 4, ఇంటిపార్టీకి 1 ఇస్తామని కథనాలు వస్తుండటంతో తమ రాజకీయ ఉనికి కోల్పొయే ప్రమాద ముందని పేర్కొంటూ టీఆర్‌ఎస్‌తో పరిచయాలు ఉన్నవారు  రహస్యంగా సంబంధాలు కొనసా గిస్తున్నారు. కమలనాథులతో స్నేహం ఉన్న ఆశావాహులు అక్కడ కర్చీప్ వేసి ఉంచారు. కూటమి జాబితా విడుదలైతే జంప్ జిలానీ దూకుడు మొదలైతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమిలో ఉన్న మూడు పార్టీలకు చెందిన 28మంది నాయకులు కండువా మార్చే అవకాశం ఉందని ఆయా పార్టీలకు చెందని శ్రేణులు వెల్లడిస్తున్నాయి. కూటమి పెద్దలు నాన్చుడు ధోరణి విడనాడి బలమైన అభ్యర్థులను గుర్తించి ప్రకటించాలని కోరుతున్నారు.
Tags:28 jalanis in the mahoututham ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *