కావలి వద్ద 28 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్
నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిలా కావలి ఫారెస్ట్ బీటు పరిధిలో 28 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ కె.చక్రవర్తి ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ఆర్ ఐ కృపానంద టీమ్ లోని ఆర్ ఎస్ ఐ ఆలీ భాషా బృందం రాపూరు నుంచి తనిఖీలు చేపట్టారు. నెల్లూరు జిల్లా కావలి వద్ద అన్నపూర్ణ రైస్ మిల్లు సమీపంలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని సమీపించడంతో ముగ్గురు వ్యక్తులు పారిపోగా ముగ్గురిని పట్టుకో గలిగారు. వారికి సమీపంలో డంప్ లభించింది. అందులో 28 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని నెల్లూరు టౌన్ కు చెందిన గల్లా ఉదయ భాస్కర్ (57), బద్వేలు కు చెందిన అబ్బు భాస్కర్ (39), బాలపల్లికి చెందిన రియాజ్ (29)లు గా గుర్తించారు. పరారీలో ఉన్న ఏర్పేడుకు చెందిన మణి, సుధాకర్, రైల్వే కోడూరు వ్యక్తి దశరథ నాయుడు కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలు 816 కిలోలు ఉండగా, రూ. 75లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును సిఐ చంద్రశేఖర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులను డీఐజీ సెంథిల్ కుమార్ అభినందించి రివార్డ్స్ ప్రకటించారు.
Tags; 28 red sandalwood logs seized from Kavali
