ఆగస్టు 28 నుండి 30వ తేదీ వరకుకార్వేటినగరంశ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు
తిరుపతి ముచ్చట్లు:
కార్వేటినగరం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.మొదటిరోజు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, రెండు, మూడవ రోజుల్లో
శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారికి ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహిస్తారు.ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Tags:28th to 30th August at Karvetinagaramsree Venugopalaswamy temple.
