ప్రార్ధనా శిబిరంలో తొక్కిసలాట..29 మంది మృతి
-మృతుల్లో 11 మంది చిన్నారులు
మన్రోవియా ముచ్చట్లు:
పశ్చిమ ఆఫ్రికా దేశం లైబీరియాలోని ఓపెన్-ఎయిర్ పెంటెకోస్టల్ చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించారు. మృతుల్లో పదకొండు మంది చిన్నారులున్నారు. లైబీరియా రాజధాని మన్రోవియా సమీపంలోని న్యూ క్రూ మురికివాడలో తొక్కిసలాట జరిగింది. రాత్రికి రాత్రే 29 మంది మరణించినట్లు లైబీరియా డిప్యూటీ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి చెప్పారు వరల్డ్ ఆఫ్ లైఫ్ ఔట్ రీచ్ మిషన్ నిర్వహించిన క్రిస్టియన్ ఆరాధన కార్యక్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ తొక్కిసలాటలో 29 మంది మరణించారని, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారని వైద్యులు చెప్పారు. ఒక సాయుధ బృందం దోపిడీకి ప్రయత్నించిందని వదంతులు రావడంతో తొక్కిసలాట ప్రారంభమయిందని ప్రత్యక్ష సాక్షుల కథనం.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: 29 killed in stampede at worship camp