మూడు ప్రాంతాల్లో 29 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

శేషాచలం ముచ్చట్లు:

శేషాచలం అటవీ పరిధి లోని పులిబోను, అన్నదమ్ముల బండ, బొమ్మాజీ కొండ పరిసర ప్రాంతాల్లో 29 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు తెలిపారు.  డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో, ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి కి చెందిన మూడ్ టీమ్ లు శేషాచలం కొండల్లో కూంబింగ్ చేపట్టాయి. గురువారం ఉదయం వివిధ సమయాల్లో పులిబోను సమీపంలోని గుండాల కోన వద్ద 11 , అన్నదమ్ముల బండ వద్ద 12, బొమ్మాజి కొండ వద్ద 6 ఎర్రచందనం దుంగలు లభించాయని తెలిపారు. అయితే స్మగ్లర్లు పారిపోయినట్లు తెలిపారు. మొత్తం 29 దుంగలు 598 కిలోలు బరువుండగా, విలువ రూ.25 లక్షలని తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: 29 red sandalwood logs seized in three areas

Post Midle
Post Midle
Natyam ad