29 న రాయచోటి వైఎస్ఆర్ సీపీ ఫ్లినరీ సమావేశాలు-ఎమ్మెల్యే గడికోట  శ్రీకాంత్ రెడ్డి

రాయచోటి ముచ్చట్లు:


నియోజకవర్గ  కేంద్రమైన రాయచోటి అన్నమయ్య జిల్లా వైఎస్సార్ సీపీ ప్లీనరీ సమావేశాలకు వేదిక కానుంది. ఈ నెల 29 న  రాయచోటి నియోజకవర్గ ఫ్లినరీతో పాటు అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ సిపి  ఫ్లినరీ సమావేశాలను  నిర్వహి స్తున్నట్లు వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు , ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. జిల్లా ఏర్పడిన తరువాత మొదటి సారిగా జిల్లా కేంద్రమైన రాయచోటిలో  జిల్లా ప్లీనరీ సమావేశాలను పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు . ఈనెల 27న ఉదయం తంబళ్ల పల్లె, మధ్యాహ్నం మదనపల్లె, సాయంత్రం పీలేరు నియోజకవర్గాలలో ఫ్లినరీ లు జరుగుతాయన్నారు. 28 న ఉదయం రాజంపేట, సాయంత్రం రైల్వేకోడూరు నియోజక వర్గాల  ఫ్లినరీలు ఉంటాయన్నారు. 29వ తేదీన రాయచోటి నియోజక వర్గ ప్లీనరీ మరియు  అన్నమయ్య జిల్లా ఫ్లినరీ సమావేశాలను నిర్వహిస్తు న్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ,శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, పార్టీ పరిశీలకులు, జిల్లాలోని  ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని తెలిపారు. 29న రాయచోటిలో జరిగే ఫ్లినరీ సమావేశానికి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ సిపి  మండల కన్వీనర్ లు ఎంపీపీ లు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని విజయవంతం చేయాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.

 

Tags: 29th Rayachoti YSR CP Plenary Meetings-MLA Gadikota Srikanth Reddy

Post Midle
Post Midle
Natyam ad