ఓటరు అవగాహనపై 2కే రన్ 

Date:18/09/2018
సిద్దిపేట ముచ్చట్లు:
జ్వేల్ పట్టణంలో ఓటరు నమోదుపై అవగాహన కోసం 2 కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ యువకులతో కలిసి రన్ చేశారు. ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా అయన ప్రజ్ఞాపూర్ నుండి గజ్వెల్ వరకు దాదాపుగా 3 కిలోమీటర్ల మేర పరుగు తీశారు.
తరువాత గజ్వెల్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లో ఓటు వేయడం అనేది ఒక అదృష్టమని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా  నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బదిలీ చేసుకునే అవకాశాన్ని సైతం భారత ఎన్నికల కమిషన్ కల్పించిందని అన్నారు.
కార్యక్రమానికి మరింతగా ఉత్సాహాన్ని ఇచ్చిన సంపూర్ణేష్ బాబుకార్యక్రమానికి వచ్చిన నటుడు సంపూర్ణేష్ బాబును జనాలు కేరింతలతో స్వాగతించారు.ఈ సందర్భంగా సంపూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినిమోగించుకొని మనల్ని మనం పరిపాలించుకొనే ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు.
దేశ భవిష్యత్తు మనం వేసే ఓటు పై అధారపడి ఉన్నదని ఆయన అన్నారు. ఈ 2కే కార్యక్రమంలో  ప్రథమ బహుమతి యం.డి.సలీం, ద్వితీయ స్థానంలో ఎల్లం, తృతీయ స్థానంలో నిలిచిన  మల్లేశం లకు మెడల్,  ప్రశంసా పత్రాలు అందించారు. ఈ  కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్ పద్మాకర్ , గజ్వెల్ మున్సిపల్ చైర్మన్  భాస్కర్ , గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డిఓ విజయేందర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.
Tags: 2K run on voter awareness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *