Natyam ad

బి కొత్తకోటలో 3లక్షల నగదు సీజ్ చేసిన సీఐ

కొత్తకోట ముచ్చట్లు:

బి. కొత్తకోట పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించి రూ. 3 లక్షల నగదును సీజ్ చేశారు. ఇందుకు సంబందించి బి. కొత్తకోట సీఐ సూర్య నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బీరంగి సమీపన ఉన్న తానామెట్ట బార్డర్ చెక్పోస్ట్ వద్ద వాహనాలను సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికల నిబంధనల దృష్ట్యా చేపట్టిన తనిఖీలో బెంగళూరు నుంచి బి. కొత్తకోటకు ఎలాంటి రసీదులు లేకుండా కారులో తీసుకుని వస్తున్న రూ. 3లక్షల నగదును స్వాదీనం చేసుకుని విచారణ అనంతరం ఎలాంటి రసీదులు లేకపోవడంతో సీజ్ చేశామన్నారు పట్టుబడిన నగదును స్థానిక విఆర్వో ఉత్తర్వుల మేరకు ట్రెజరీలో జమ చేసామని సీఐ తెలిపారు.

 

Post Midle

Tags: 3 lakhs in cash was seized by CI in B Kottakota

Post Midle