Natyam ad

3అధికారులు  రాలేదు..

అవనిగడ్డ ముచ్చట్లు:

 


రైతులుమిచాంగ్ తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలకు నీటు మునిగిన వరి పంట చేతికి రాకపోవడంతో దిక్కుతోని స్థితిలో ఉన్నారు. నియోజకవర్గ కేంద్రమైన అవనిగడ్డలో మొలకెత్తిన వరి పొలాన్ని దమ్ము చేయిస్తున్నారు.

కౌలుకు తీసుకుని ఆరు ఎకరాల్లో వరి సాగు చేయడం జరిగిందని, అకాల వర్షానికి పంట నీట మునిగి మొలకలు రావడంతో ఆర్థికంగా నష్టపోయానని వాపోతున్నారు. లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టి, ఇప్పుడు మొలకెత్తిన వరి పంటను కోసేందుకు కుప్ప వేసేందుకు నూర్పుడి చేయించేందుకు వేలాది రూపాయలు ఖర్చు కావడంతో, భరించలేక దమ్ము చేయిస్తున్నారు.
ప్రభుత్వం కూడా తమను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. గత పది రోజుల క్రితం మూడు ఎకరాల్లో ఓరి నూర్చిన ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసారు. అధికారులు కూడా నీట మునిగిన తమ పంట పొలాలను పరిశీలించేందుకు రాలేదని ఆరోపించారు. చేతికి అంది వచ్చిన పంట నష్టపోవడంతో దాదాపు రూ. 1.30 లక్షలు వరకు నష్టపోయామని చెబుతున్నారు. నీట మునిగిన వరి ఫైరును దమ్ము చేయించి మినుము పంట వేసుకోడం మినహా గత్యంతరం లేదని చెప్తున్నారు.

Post Midle

Tags: 3 officials did not come..

Post Midle