వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి 30 లక్షలు ఆర్థిక సహాయం

Date:04/12/2020

ఐరాల ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా స్టేట్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాధాకృష్ణ తీవ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి స్టేట్ బ్యాంక్ తరపున 30 లక్షల రూపాయల చెక్ ను ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందించారు.ఈ సందర్భంగా చీఫ్ మేనేజర్ రాధాకృష్ణ మాట్లాడుతూ పాకిస్తాన్ ముష్కరులతో జరిగిన పోరాటంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి మరణించడం దురదృష్టకరమని, ప్రవీణ్ కుమార్ రెడ్డి తమ బ్యాంక్ లో డిఫెన్స్ అకౌంట్ కలిగిఉండడం వల్ల ఆయన మరణానంతరం 30 లక్షల రూపాయలు ఇన్సూరెన్ డబ్బులు వచ్చాయన్నారు… ఈడబ్బులను ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా వాడుకోవాలని,భవిష్యత్తులో ప్రవీణ్ కుమార్ కుటుంబానికి స్టేట్ బ్యాంక్ అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ రాధాకృష్ణ తో పాటు పొలకల స్టేట్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున, జలే బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

Tags: 30 lakh financial assistance to the family of Praveen Kumar Reddy who passed away

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *