Natyam ad

30 ఎర్రచందనం దుంగలు స్వాధీనం- ఇద్దరు అరెస్ట్

తిరుపతి ముచ్చట్లు:

రేణిగుంట మండలం కరకంబాడీ చైతన్య పురం సమీపంలో 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు స్మగ్లర్లు ను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు డీఎస్పీ మురళీధర్ పర్యవేక్షణ లో కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ ఐ కృపానంద టీమ్ కూంబింగ్ కు వెళ్లారని తెలిపారు. బుధవారం ఉదయం కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించినట్లు తెలిపారు. అతన్ని పట్టుకుని, పరిసరాల్లో పరిశీలించగా సమీపంలో10 ఎర్రచందనం దుంగలు లభించాయి. అతనిని కరకంబాడీ కి చెందిన తిరుపతి సుబ్రమణ్యం (30)గా గుర్తించారు. అతన్ని విచారించగా తన బంధువు సతీష్ (25)తో కలసి స్మగ్లింగ్ చేయాలని భావించినట్లు తెలిపారు. సతీష్ ను పట్టుకుని విచారించగా చీకిగుట్ట వద్ద మరో 20 దుంగలు దాచి ఉంచినట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి 30 దుంగలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన దుంగలు 777కిలోలు ఉన్నాయని, వీటి విలువ రూ.50 లక్షలు ఉండవచ్చునని తెలిపారు. కూంబింగ్ లో పాల్గొన్న సిబ్బందికి కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్ కుమార్ రివార్డులు ప్రకటించారు.

Post Midle

పరారీలో ఉన్న ఆరుగురు అరెస్ట్

కోర్టులో నాన్ బెయిలబుల్ వారంట్ కలిగి గత ఐదేళ్లుగా పరారీలో ఉన్న ఆరుగురు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు ఎస్పీ మేడా సుందరరావు తెలిపారు. ఇటీవల స్మగ్లర్లు తమిళనాడు నుంచి రావడం తగ్గిపోయారని, స్థానికులు ఎక్కువగా స్మగ్లింగ్ చేస్తున్నట్లు తమ పరిశీలనలో వెళ్లాడయినట్లు తెలిపారు.

 

Tags: 30 Red Sandalwood Logs Seized- Two Arrested

Post Midle