Natyam ad

ది క్రెడో పాఠశాలలో 30వ నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్

-ముఖ్యతిధిగా హాజరైన జిల్లా విద్యాధికారి రంగారెడ్డి

కర్నూలు ముచ్చట్లు :

తాండ్రపాడు లో గల’  ది క్రెడో పాఠశాల’ లో 30వ నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమమును జిల్లా విద్యాధికారి రంగారెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరై ప్రారంభించారు. జిల్లా విద్యాధికారి రంగారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి అబ్దుల్ కలాం ఫోటోకి పూలమాల వేసిన అనంతరం  విద్యార్థులను ఉద్దేశించే ప్రసంగిస్తూ ప్రయోగాలతోనే అద్భుతంగా ఫలితాలు సాధించవచ్చని సొంతంగా ఆలోచించడం అభివృద్ధి వైపు అడుగులు  వేసే విధంగా ప్రణాళిక రచించుకోవడం విద్యార్థి దశ నుంచి నేర్చుకోవాలన్నారు. స్టేట్ రీజినల్ కో-ఆర్డినేటర్ కుమార్ బాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమమైనా హాజరైన ప్రతి విద్యార్థికి తన అభినందనలు తెలియజేస్తూ చక్కటి ప్రదర్శనలు కనబరిచిన విద్యార్థులకు తన అభినందనలు తెలియజేశారు. స్వచ్ సర్వేక్షం బ్రాండ్ అంబాసిడర్ రంగమ్మ ప్రసంగిస్తూ ఈ కార్యక్రమమునకు హాజరైన ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధ్యాయుడికి  చక్కటి భోజన వసతి ఏర్పాటుచేసిన ది  క్రెడో స్కూల్  యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ది క్రెడో పాఠశాల ప్రిన్సిపల్  టి. శ్రావ్య లక్ష్మి విద్యార్థులను  ఉద్దేశించి మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి తమ యాజమాన్యం ఎప్పుడు ముందుంటుందని ఈ కార్యక్రమం నిర్వహించడానికి తమకు అవకాశం కల్పించిన జిల్లా విద్యాధికారి రంగారెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ది క్రీడో పాఠశాల కరస్పాండెంట్ కార్తీక్ కుమార్ మాట్లాడుతూ ఈ జాతీయ బాలల  సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమమునకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 800 విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర కుమార్ (వైస్ చైర్మన్ ఆఫ్ రెడ్ క్రాస్ సొసైటీ) సుబ్బారెడ్డి (ఏ.పీ. కాస్ట్ అడ్వైజర్) హకీమ్ (డిస్టిక్ అకాడమిక్ కో-ఆర్డినేటర్) పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: 30th National Children’s Science Congress at The Credo School

Post Midle