హైద‌రాబాద్ జిల్లాలో 31 మంది  అభ్య‌ర్థులు, 36 నామినేష‌న్లు

– దాన‌కిషోర్‌
Date:16/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
రాష్ట్ర శాస‌న స‌భ‌కు జ‌రిగే ఎన్నిక‌ల‌కుగాను హైద‌రాబాద్ జిల్లాలో శుక్ర‌వారం నాడు 31 మంది అభ్య‌ర్థులు 36 నామినేష‌న్లు దాఖ‌లు చేశార‌ని హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ తెలిపారు. దీంతో గ‌త ఐదు రోజులుగా అందిన నామినేష‌న్లు 126కి చేరాయ‌ని దాన‌కిషోర్ పేర్కొన్నారు. నేడు సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుండి రాజ్యాధికార పార్టీ అభ్య‌ర్థిగా పంప‌రి న‌ర్సింహా న‌రేంద‌ర్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు.
జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్య‌ర్థిగా ఎం.గోపినాథ్‌, తెలంగాణ క‌మ్యునిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అభ్య‌ర్థిగా కుక్క‌ల న‌రేష్‌కుమార్, ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పి.విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిలు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. మ‌ల‌క్‌పేట్ నియోజ‌క‌వ‌ర్గం నుండి అఖిల భార‌త జ‌న‌సంఘ్ పార్టీ నుండి ప‌వ‌న్‌కుమార్ శ‌ర్మ మూడు సెట్ల‌ నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఆర్‌.జే.డి పార్టీ నుండి స‌య్య‌ద్ ర‌జా ఎండి అన్వ‌ర్, అన్న వైఎస్సార్ పార్టీ అభ్య‌ర్థిగా స‌య్య‌ద్ అన్వ‌ర్‌లు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ముషిరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుండి అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా ఫాతిమా భాను నామినేష‌న్లు దాఖ‌లు చేశారు.
అంబ‌ర్‌పేట్ నియోజ‌క‌వ‌ర్గం నుండి ఇండిపెండెంట్ అభ్య‌ర్థులుగా కె.శ్యామ్‌, కొమిరి స‌త్యం నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుండి స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా సోమ త్రినాథ‌రావు, న‌ర్సింగ్ సింగ్‌లు, బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ అభ్య‌ర్థులుగా చంద్ర‌శేఖ‌ర్‌రావు గాజుల నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. చాంద్రాయ‌ణ‌గుట్ట నియోజ‌క‌వ‌ర్గం నుండి తెలంగాణ రాష్ట్ర స‌మితి అభ్య‌ర్థిగా ఎం.సీతారాంరెడ్డి, బి.జె.పి నుండి కుమారి స‌హ‌జాది స‌య్య‌ద్‌లు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు.
స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుండి బ‌హుజ‌న రాష్ట్ర స‌మితి అభ్య‌ర్థిగా ఎం.ఆర్‌.అశోక్‌కుమార్‌, స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా శ్రీ‌నివాస్‌.ఏ (మూడు సెట్లు), తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిగా కూన వెంక‌టేశ్‌గౌడ్‌లు నామినేష‌న్లు దాఖలు చేయ‌గా, కార్వాన్ నియోజ‌క‌వ‌ర్గం నుండి భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థిగా అమ‌ర్‌సింగ్ (రెండు సెట్లు), బ‌హుజ‌న లెఫ్ట్ పార్టీ అభ్య‌ర్థిగా గుట్ట‌మీది విఠ‌ల‌య్య‌లు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు.
ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుండి న‌వ‌భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అభ్య‌ర్థిగా ఎం.క‌ల్యాణ‌రామ‌కృష్ణ‌, స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా మిద్దె క్రిష్ణ‌, ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌, అంబేడ్క‌ర్ నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పి.జాన‌కి, బ‌హుజ‌న లెఫ్ట్ పార్టీ అభ్య‌ర్థిగా కె.యాద‌గిరిలు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు.
యాకత్‌పుర నియోజ‌క‌వ‌ర్గం నుండి శివ‌సేనా అభ్య‌ర్థిగా జ‌మాల్‌పూర్ మ‌హేష్ కుమార్, స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా క‌ట్టా సుద‌ర్శ‌న్ నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌గా, బహ‌దూర్‌పుర నియోజ‌క‌వ‌ర్గం నుండి టీ.ఆర్‌.ఎస్ అభ్య‌ర్థిగా మీర్ ఇనాయ‌త్ అలీ బాక్రి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుండి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా ఏచు సునీల్‌, లోక్ తాంత్రిక్ స‌ర్వ‌జ‌న్ స‌మాజ్ పార్టీ అభ్య‌ర్థిగా పార్వ‌తి శ్రీ‌రాల నామినేష‌న్లు దాఖ‌లు చేశారు.
Tags: 31 candidates and 36 nominees in Hyderabad district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *