చార్‌ధామ్ యాత్ర లో 31 మంది మృతి

డెహ్రాడూన్‌  ముచ్చట్లు:


ఉత్త‌రాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. అయితే ఆ యాత్ర‌కు వెళ్లిన భ‌క్తుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 31 మంది మృతిచెందిన‌ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. మే 3వ తేదీన చార్‌ధామ్ యాత్ర ప్రారంభ‌మైంది. మౌంటేన్ సిక్నెస్‌తో పాటు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల భ‌క్తులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. హై బీపీ, హార్ట్ అటాక్‌, మౌంటేన్ సిక్నెస్‌తో యాత్రికులు చ‌నిపోయిన‌ట్లు ఆరోగ్య‌శాఖ డీజీ డాక్ట‌ర్ శైల‌జా భ‌ట్ తెలిపారు. ప్ర‌యాణ మార్గంలో ఉన్న పాయింట్ల వ‌ద్ద హెల్త్ స్క్రీనింగ్ చేప‌డుతున్న‌ట్లు చెప్పారు. రిషికేశ్‌లోని రిజిస్ట్రేష‌న్ సైట్ వ‌ద్ద ప్ర‌యాణికుల‌ను స్క్రీనింగ్ చేస్తున్నారు. పండుకేశ్వ‌ర్ వ‌ద్ద కూడా స్క్రీనింగ్ క్యాంపును ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

 

Tags: 31 killed in Chardham yatra

Post Midle
Post Midle
Natyam ad