32బద్వేలు ను కుదిపేస్తున్న నకిలీ పట్టాలు ప్రభుత్వ భూముల కబ్జాలు

నకిలీ ఇంటి పట్టాలు ప్రభుత్వ భూముల కబ్జాలో తిలాపాపం తలా పిడికెడు
రెవెన్యూ అధికారులు సిబ్బంది కూడా ఇందులో భాగమే
కొందరు రెవెన్యూ అధికారుల్లో నీతి నేతి బీరకాయ చందాన ఉంది
అధికారాన్ని అడ్డుపెట్టుకొని వందల కొద్ది ఇంటి పట్టాలు పొందిన కొందరు రెవెన్యూ అధికారులు

బద్వేలుముచ్చట్లు:


బద్వేల్ నియోజకవర్గాన్ని నకిలీ ఇంటి పట్టాలు ప్రభుత్వ భూముల కబ్జాలు కుదిపేస్తుంది మూడు నెలలు గడిచినా ఈ సమస్య ఇప్పటికీ ఒక కొలిక్కి రావడం లేదు ఈ విషయంలో కొందరు అధికారులు మీనమేషాలు లెక్క పెడుతున్నారు ఇప్పటి వరకు కేవలం ఎనిమిది మంది మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు మొత్తం 17 మంది పై పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది మిగిలిన వారు ముందస్తు బెయిల్ పొంది దర్జాగా తిరుగుతున్నారు వీరి బెయిలు రద్దు చేయాలని పోలీసులు తాజాగా కోర్టును ఆశ్రయించారు గతములో బద్వేలు గోపవరం మండలాలకు తాసిల్దార్ గా పనిచేసిన వారు తమ స్వార్థం కోసం బినామీ పేర్లతో వందల సంఖ్యలో ఇంటి పట్టాలు ప్రభుత్వ భూములు పొందారు ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది బద్వేల్ ఆర్డిఓ ఆకుల వెంకటరమణ లోతుగా విచారణ చేపట్టడంతో సంచలనాత్మక విషయాలు వెలుగుచూస్తున్నాయి బినామీ పేర్లతో పట్టాలు పొందినవారు ఒక్క తాసిల్దార్ లే కాదు పలువురు రెవెన్యూ సిబ్బంది కూడా ఉన్నారు ఇద్దరు ముగ్గురు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా ఇందులో భాగమే వారిపై కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఈ విషయంపై  అధికారికంగా అధికారులు నోరు  మెదపడం లేదు గతంలో బద్వేలు గోపవరం రెవెన్యూ కార్యాలయాల వద్ద వందల సంఖ్యలో బ్రోకర్లు ఉండేవారు ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే రెండు మండలాల్లో రేషన్ షాపుల డీలర్ల హావ సాగింది వారు చెప్పింది అధికారులు వినేవారు. నకిలీ ఇంటి పట్టాలు ప్రభుత్వ భూముల కబ్జాలు చేసేవారు బాగా పెద్ద చదువులు చదివిన వారు కాదు చదువు లేకపోయినా నకిలీ పట్టాలు తయారుచేయడంలో వారికి వారి సాటి ఇక అసలు విషయానికి వస్తే నకిలీ ఇంటి పట్టాల కేసులో పిల్లి భాస్కర్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపడితే అనేక విషయాలు వెలుగుచూశాయి దాదాపు 40 మంది పేర్లు పిల్లి భాస్కర్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం వీరు పలు సర్వే నంబర్లలో నకిలీ ఇంటి పట్టాలు చేయించుకొని  క్రయ విక్రయాలు జరిపి కొన్ని లక్షల రూపాయలు దండుకున్నారు.

 

 

 

Post Midle

నకిలీ పట్టాలు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు లబోదిబో అంటున్నారు నకిలీ పట్టాలు చేయించుకున్నవారిలో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి వీరిలో ఎక్కువ శాతం రాజకీయ ముసుగు వేసుకున్న వారే బద్వేల్ లో నకిలీ ఇంటి పట్టాల వ్యవహారం ఇప్పటికీ కాక రేపుతుంది నిజం నిప్పు లాంటిది అని కొంత ఆలస్యంగానైనా నకిలీల బాగోతం వెలుగు చూసింది బద్వేలు పట్టణం నడిబొడ్డున ఎన్జీవోలకు కేటాయించిన స్థలాల్లో కూడా నకిలీలు పుట్టించారు  ఒక లేఔట్ లో ఓపెన్ స్పేస్ కోసం కేటాయించిన స్థలములో కూడా  నకిలీల వ్యవహారం నడిచింది ఈ విషయం తెలిసి ప్రజలు అధికారులు ఆశ్చర్యపోతున్నారు బద్వేల్ పట్టణంలో ఎన్జీవోలకు 1987లో ఇంటి స్థలాలు కేటాయించారు గోపవరం మండలం మడకల వారిపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 941 నుంచి 956 వరకు 60 ఎకరాల్లో లేఅవుట్ వేశారు ప్రజా  ప్రయోజనాల కోసం కొంత ఖాళీ స్థలాన్ని కేటాయించారు నిబంధనల ప్రకారం లే అవుట్ లో 10 శాతం కమ్యూనిటీ భవనానికి ప్రార్ధన మందిరాలకు పాఠశాలకు పార్కు కు కేటాయించారు ఈ స్థలానికి కూడా నకిలీ ఇంటి పట్టాలు పుట్టించారు డి కే టి మొదటి పేజీలో కావలసిన వివరాలు రాసుకొని ఆ తర్వాత రెండవ పేజీలో ఒరిజినల్ అధికారి ఇచ్చిన పట్టాను నకలు తయారుచేసి పెడుతున్నారు ఇలా ఇది ఒరిజినల్ అని నమ్మకాన్ని వాళ్లు కల్పిస్తున్నారు ఇదంతా పక్క ప్రణాళికలతో  చేసినట్లు రెవెన్యూ అధికారులే చెబుతున్నారు ఎన్జీవోలకు ఇక్కడ 8 సెంట్లు ప్రకారం 343 మందికి ఐదు సెంట్ల ప్రకారం 236 మందికి ప్లాట్లు గతంలో కేటాయించారు అప్పట్లో ఎన్జీవోలకు కేటాయించిన స్థలం పట్టణానికి చాలా దూరంగా ఉండేది రాను రాను పట్టణం బాగా విస్తరించింది దీంతో వీటికి మంచి గిరాకి వచ్చింది .

 

 

 

 

5 సంవత్సరాల క్రితం ఇక్కడ సెంటు 2 నుండి 3 లక్షల రూపాయలు పలికేది ఇప్పుడు సెంట్ 20 లక్షల రూపాయలు పైగా పలుకుతుంది గతంలో గోపవరం మండల తాసిల్దార్ గా పనిచేసిన ఒక అధికారి ఎన్జీవో సంఘం లో ఒక నేత మరొక ఉద్యోగి కలిసి మరి కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఒక ముఠాగా ఏర్పడి వీటిని కాజేసే పథకానికి అంకురార్పణ చేశారు కొంతమందిని కలుపుకొని ఇంకా పలువురు రాజకీయ పెద్దలను తమ ముఠాలో భాగస్వాములుగా చేశారు వీరంతా కలిసి నకిలీ ఇంటి పట్టాలకు శ్రీకారం చుట్టారు నకిలీ ఇంటి పట్టాలు తయారుచేసి క్రయ విక్రయాలు చేశారు బద్వేలులో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఒక నేత ఇందులో క్రియాశీలకంగా ఉన్నాడు ఆ నేత ఎవరనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం నకిలీ పట్టాలు తయారు చేసిన వారు ఆ స్థలాలు తమ ఆదినములో ఉంచు కున్నట్లు సమాచారం ఇప్పుడు వీటిపై కూడా లోతుగా విచారణ జరుగుతుంది బద్వేలులో నకిలీ ఇంటి పట్టాల దంద గత కొన్ని సంవత్సరాలుగా సాగుతోంది బద్వేలు ఆర్డీవో గా ఆకుల వెంకటరమణ వచ్చిన తర్వాత నకిలీ ఇంటి పట్టాల బాగోతం వెలుగు చూసింది బద్వేలులో నివాస ప్రాంతాలకు ఎక్కువగా డిమాండ్ ఉంది గతంలో రెవెన్యూ అధికారులు కొన్ని వేల మందికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ ఇచ్చిన స్థలాలు శివారు ప్రాంతాల్లో ఉండడంతో అక్కడ నిర్మాణాలు చేపట్టలేదు పట్టాలు పొందినవారికి రెవెన్యూ అధికారులు అవి ఎక్కడ ఉన్నాయో చూపలేదు దీంతో ఆ ప్రాంతం ఖాళీగా ఉండిపోయింది పట్టణం విస్తరించడంతో గతంలో పట్టాలు పొందిన వారికి బాగా డిమాండ్ వచ్చింది కానీ వాటిపై నకిలీ పట్టాలు తయారుచేసే వారి కన్ను పడింది ఒక్క స్థలంపై నాలుగైదు నకిలీ పట్టాలు తయారు చేశారు బద్వేలు పట్టణంలో మేజర్ భాగమంతా గోపవరం మండలం మడకల వారి పల్లె రెవెన్యూ పరిధిలో ఉంది ఈ రెవెన్యూ పరిధిలోనే 90% ప్రభుత్వ స్థలాలు ఉండడంతోపాటు కళాశాలలు సినిమా థియేటర్లు ఆర్టీసీ బస్టాండ్ మున్సిపల్ కార్యాలయము హోటళ్ళు వ్యాపార సంస్థలు ఇంకా ఎన్నో ఉన్నాయి అంతేకాక భారీ భవంతులు కూడా ఈ రెవెన్యూ పరిధిలోనే ఉన్నాయి దీంతో ఇక్కడి స్థలాలకు ఎక్కడలేని గిరాకి వచ్చింది గతంలో ఇంటి పట్టాలు పొందినవారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు.

 

 

 

అనే విషయం చాలామందికి తెలియదు ఇది నకిలీ ఇంటి పట్టాలు  చేసే వారికి వరంగా మారింది బద్వేలు గోప వరం రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేసే కొంత మంది సిబ్బంది నకిలీ ఇంటి పట్టాలు తయారు చేసే వారికి అన్ని విధాల సహకరించారు ఇందులో కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా లేకపోలేదు నేతలు పలువురు వీరికి అన్ని విధాలుగా అండగా నిలిచారు రాజకీయ నేతల అండదండలతో నకిలీ పట్టాలు చేసి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారు ముఖ్యంగా నలుగురు తాసిల్దార్ ల పేరుతో నకిలీ ఇంటి పట్టాలు పుట్టుకొచ్చాయి గోపవరం మండలంలో గతంలో తాసిల్దార్ గా పనిచేసిన జయరాజు ఉదయ భాస్కర్ రాజుఉదయ సంతోష్ ఎల్.వి.ప్రసాద్ తదితర అధికారుల పేర్లతో నకిలీ ఇంటి పట్టాలు తయారు చేశారు వీరిలో జయరాజు చనిపోయాడు ఎల్.వి ప్రసాద్ఉద్యోగ విరమణ చేశారు వీరిలో ముగ్గురిని విచారణకు పిలిచినట్లు సమాచారం ఒక తాసిల్దార్ పేరుతో దాదాపు 400 పైగా నకిలీ పట్టాలు  చేసినట్లు విశ్వసనీయ సమాచారం అలాగే మరో వెయ్యికి పైగా నకిలీ పట్టాలు తయారు చేశారు వీటిని పరిశీలించిన అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు నకిలీ పట్టాల తయారీలో బాగా ఆరితేరిన వారే ఇలాంటివి చేస్తారని అధికారులు చెబుతున్నారు రెవెన్యూ వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా ఇక్కడ వ్యవహారం నడుస్తుంది బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఇప్పటికీ 20 వేలకు పైగా నకిలీ పత్రాలు ఉన్నట్లు సమాచారం దాదాపు రెండువేల కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూములు ఇంటి స్థలాలు ప్రస్తుతం వీరి చేతుల్లో ఉన్నాయి రెవెన్యూ పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపితే ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వస్తాయి.

 

Tags: 32 Fake rails encroaching on Badvelu Government land grabs

Post Midle
Natyam ad