3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ లకు రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయం జమ చేసిన సీఎం జగన్
మార్పు కనిపిస్తే..అది మీ బీడ్డ పాలన మా జగనన్న పరిపాలన అంటారు: సీఎం
రాజధాని భూములు నుంచి స్కీల్ స్కామ్ వరకు చంద్రబాబు అన్నింటా దోచుకోవటమే: సీఎం
ఎమ్మిగనూరు ముచ్చట్లు:

“అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచేసింది. అప్పుడు అభివృద్ధి ఎందుకు జరగలేదో ప్రజలు ఆలోచించాలి. అప్పుడు ఇప్పుడు అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారింది కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. చంద్రబాబు పాలన చూస్తే కుప్పంలో కూడా ఆయన మావాడే అని చెప్పుకునే పరిస్థితి లేదు. కుప్పంలో ఒక్క పేదవాడికి కూడా చంద్రబాబు స్థలం ఇవ్వలేదు. కానీ, మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం కొన్ని వేల ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. వెనుకబడిన కులాలను, వెనుకబడిన వర్గాలను.. వెన్నెముక మాదిరిగా దృఢంగా మారుస్తామూ అని ఏదైతే మాట ఇచ్చామో పాదయాత్ర సందర్భంగా.. ఈ రోజు నేను మీ బిడ్డగా మీ అన్నగా.. మీ తమ్ముడిగా.. సగర్వంగా తలెత్తుకుని చెబుతా ఉన్నాను. ఈ 52 నెలల పరిపాలనలో నవరత్నాల్లోని ప్రతీ ఒక్క కార్యక్రమం ద్వారా నా ఎస్సీలను, నా ఎస్టీలను, నా బీసీలను, నా మైనారిటీలను, నా నిరుపేద వర్గాలను చేయి పట్టుకుని నడిపించగలిగాను. వారి జీవిత ప్రయాణంలో తోడుగా ఉండగలిగామని సగర్వంగా, మీ బిడ్డగా చెప్పుకోవడానికి గర్వపడుతున్న” అని సీఎం జగన్ ఎమ్మిగనూరు బహిరంగ సభలో చెప్పారు
వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు కార్యక్రమం గురువారం కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ప్రతి ఏటా రూ.10 వేల ఆర్థికసాయం చేస్తూ ఈ నాలుగేళ్లలో ఈ పథకానికి రూ.1,252.52 కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. జగనన్న చేదోడు పథకంలో 1.80 లక్షల మంది టైలర్లకు మంచి జరుగుతోందని, 1.45 లక్షల మంది నాయీబ్రహ్మణలకు, రజకులకు మంచి జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు.
మనందరి పాలన, అది మీ బిడ్డ పాలన, అది మీ జగనన్న పరిపాలన
“చేతి వృత్తులను నమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారందరికీ కూడా బతకలేని పరిస్థితి వస్తే ఎలా అన్నది కూడా ఆలోచన చేయండి. గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ ఆలోచన చేయలేదు. మన ప్రభుత్వం వచ్చాక వారిని ఆదుకునేందుకు ఆలోచన చేస్తూ అడుగులు వేస్తున్నాం. చేదోడు కార్యక్రమం, వాహన మిత్ర, స్వయం ఉపాధిని ప్రోత్సహించే అనేక పథకాల ద్వారా తోడుగా నిలుస్తున్నాను. క్రమం తప్పకుండా ప్రతి ఏడాది సహాయం అందించే కార్యక్రమం జరుగుతున్నది ఈ నాలుగేళ్ల పాలనలోనే అన్నది గమనించాలని కోరుతున్నాను”- అని సీఎం జగన్ అన్నారు.అక్కచెల్లెమ్మల సాధికారతకు, వారికి అండగా తోడుగా నిలబడే మంచి అన్న, తమ్ముడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలని ప్రతి కుటుంబం కోరుకుంటుందని, ఇలాంటి మార్పులన్నీ కూడా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ, ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి మార్పులు కోరుకుంటే, అలాంటి పాలన కనిపిస్తే.. అది మా పాలన, మనందరి పాలన అంటారని, అది మీ బిడ్డ పాలన అంటారని, అది మీ జగనన్న పరిపాలన అంటారని సీఎం జగన్ ఉద్ఘాటించారు.
చివరికి కుప్పం ప్రజలు కూడా బాబు మావాడే అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు.చంద్రబాబు పాలన చూస్తే కుప్పంలో ప్రజలకు కూడా చంద్రబాబు మా వాడు అని చెప్పుకునే పరిస్థితి కూడా అక్కడ కనిపించదని సీఎం ఎద్దేవా చేశారు. కుప్పంలో పేదవాడికి ఇంటి స్థలం కావాలంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పేదవాడికి ఇంటి స్థలాలు ఇవ్వలేకపోయాడని దుయ్యబట్టారు. అదే మీ బిడ్డ ప్రభుత్వం అక్షరాల 20 వేల మంది పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా 8 వేల మందికి పక్కా ఇల్లు నిర్మిస్తున్నది సీఎం జగన్ ఉద్ఘాటించారు.
ఎన్నికలప్పడు మేనిఫేస్టోతో వస్తారు.. ఆతర్వాత చెత్తబుట్టలో పడేస్తారు.”ఎన్నికలప్పుడు చంద్రబాబు అన్న మాటలు గుర్తున్నాయా? అప్పట్లో మీ ఇళ్లకు చంద్రబాబు, దత్తపుత్రుడి సంతకాలతో లెటర్లు తీసుకువచ్చారు. టీవీ అన్ చేస్తే చాలు..రూ.87612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే, బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలనే మాటలు వినిపించాయి. చంద్రబాబు సీఎం అయ్యారు. రుణాలు మాఫీ దేవుడు ఎరుగు, అప్పడి దాకా రైతులకు ఇస్తున్న సున్నా వడ్డీ రుణాలను కూడా ఎత్తేశాడు. కనీసం రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. సున్నా వడ్డీ పథకం రద్దు చేసి, బ్యాంకుల్లో బంగారం వేలం వేశారు”- అని సీఎం విమర్శించారు.
అప్పటి పాలనకు, మీ బిడ్డ పాలనకు మధ్య తేడాను గమనించాలని సీఎం కోరారు. ఎన్నికల మేనిఫెస్టోను అప్పట్లో చంద్రబాబు చెత్తబుట్టలో వేశాడని, కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. అదే మీ బిడ్డ పాలనలో ఎన్నికలప్పుడు మీ బిడ్డ చెప్పిన మేనిఫెస్టోలో 99 శాతం వాగ్ధానాలు పూర్తి చేసి ప్రతి గడప వద్దకు మేనిఫెస్టోను తీసుకెళ్లాడని సీఎం అన్నారు. గడప గడపకు వెళ్లి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటున్న మీ బిడ్డ పాలనను గమనించాలని సీఎం మరొక్కసారి కోరారు.రాజధాని భూములు నుంచి స్కీల్ స్కామ్ వరకు చంద్రబాబు అన్నింటా దోచుకోవటమే
*రాజధాని భూములు నుంచి స్కీల్ స్కామ్ వరకు, ఫైబర్ గ్రిడ్ నుంచి మద్యం కొనుగోళ్ల వరకు చంద్రబాబు అన్నింటా దోచుకోవటమే అని సీఎం ఆరోపించారు. అదే మీ బిడ్డ ఎటువంటి వివక్ష చూడకుండా 2లక్షల 38 వేల రూపాయిలు ప్రజలకు ఇచ్చాడని అన్నారు.
దేశమంతా మన రాష్ట్ర పొదుపు సంఘాలను చూస్తోంది
పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను మోసం చేస్తూ చంద్రబాబు అన్న మాటలు జ్ఞాపకం ఉందా? అని, అప్పట్లో టీవీల్లో ప్రకటనలు వచ్చేవని గుర్తు చేసి సీఎం వివరించారు. మంగళసూత్రం లాక్కెళ్తుంటే బాబు వచ్చి కాపాడారు అంటూ అడ్వర్‌టైజ్‌మెంట్ వచ్చేదని, బాబు సీఎం అయ్యాక అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు సీ, డీ గ్రేడ్‌కు దిగజారిపోయాయని, 18 శాతం పొదుపు సంఘాలు దిగజాయిపోయాయని, పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకం కూడా చంద్రబాబు ఎత్తేశాడని సీఎం జగన్ ధ్వజమెత్తారు. అక్కచెల్లెమ్మలకు తోడుగా మంచి అన్నగా, తమ్ముడిగా మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి చేయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడని సీఎం అన్నారు. వైయస్‌ఆర్ ఆసరా, సున్నా వడ్డీ పథకం, వైయస్‌ఆర్ చేయూత, అమ్మ ఒడిద్వారా ఆదుకోగలిగామని చెప్పారు. ఈ రోజు ఆ సంఘాలు ఏ, బీ గ్రేడ్‌లుగా వర్ధిల్లుతున్నాయని,. బ్యాంకులు సెల్యూట్ కొట్టి పొదుపు రుణాలు ఇస్తున్నారని అన్నారు. దేశం మొత్తం మన రాష్ట్రంలోని పొదుపు సంఘాలను, అక్కచెల్లెమ్మల వైపు చూస్తోందని గర్వంగా చెప్పారు.
ఆరోగ్య సురక్షతో ఉచిత వైద్య సేవలు
ఆరోగ్య సురక్షతో అందరికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించామని సీఎం జగన్ పేర్కొన్నారు. నిరుపేద బిడ్డలు వెళ్లే స్కూళ్లను ప్రైవేట్ కి ఆమ్మేసిన చంద్రబాబు పాలనకి నా నిరుపేద పిల్లలు బాబు చదవాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం పెట్టీ సాధారణ కాసులను డీజిటల్ క్లాసులుగా మార్చిన మీ బిడ్డ పరిపాలనకు తేడా గమనించాలని సీఎం కోరారు.”రాబోయేది కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం జరుగబోయేది ఎవరికో తెలుసా..పేదవాడు ఒకవైపు, పెత్తందారి మరోవైపు. కులాల మధ్య కాదు యుద్ధం జరిగేది. రేపుజరిగేది క్లాస్ వార్..పేదవాడు ఒకవైపు,పెత్తందారు మరోవైపు ఉండే యుద్ధం జరుగబోతోంది. వీరి మాదిరిగా మీ బిడ్డకు ఎల్లో మీడియా సపోర్టుగా లేవు, వీళ్ల మాదిరిగా దత్తపుత్రుడి అండ, తోడు ఉండదు. ఆలోచన చేయండి”- అని సీఎం కోరారు.రేపు జరుగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులందరూ ఏకమవుతారని, తోడేళ్లన్ని ఏకమవుతాయని, కానీ మీ బిడ్డ కోరుకునేది పైన దేవుడి దయ, మీ చల్లని దీవెనలు మాత్రమే అని సీఎం జగన్ మరోసారి ఉద్ఘాటించారు. రేపు జరుగబోయే కురుక్షేత్రంలో ఓటువేసేందుకు వెళ్తున్నప్పుడు ఒక్కటే ఒక్కటి కొలమానంగా తీసుకోవాలని, మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా?లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోవాలని, మీకు మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడంండని సీఎం జగన్ ప్రజలను కోరారు.
Tags: 3,25,020 eligible Rajaka, Nai Brahmin, Tailors Rs. CM Jagan deposited 325.02 crore financial aid
