347 మండ లాల్లో వర్షపాతం తక్కువే

నెల్లూరు   ముచ్చట్లు:

ఏరువాక పౌర్ణమిని ఖరీఫ్‌ సేద్యానికి ఆరంభ సూచికంగా తెలుగునాట రైతులు భావిస్తారు. అరకలు పట్టి రైతులు ఉత్సాహంగా  ఏరువాక ను సాగించాల్సి ఉండగా ఈ తడవ తొలకరి ప్రారంభంలోనే వర్షాభావం ఏర్పడింది. రాష్ట్ర భూభాగంలో సగానికిపైగా వర్షాభావం నెలకొంది. ఎనిమిది జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. నెల్లూరులో అత్యల్ప స్థాయి (60 శాతం పైన లోటు) వర్షపాతం నమోదైంది. ఎపి వ్యాప్తంగా 670 మండలాలుండగా ఏకంగా 347 మండలాల్లో తక్కువ వర్షం పడింది. వాటిలో కూడా 121 మండలాల్లో అత్యల్ప స్థాయి వర్షం రికార్డయింది. 226 మండలాల్లో తక్కువ వర్షం (లోటు 20ా59 శాతం) కురిసింది. నాలుగు మండలాల్లో చినుకు పడలేదు. అవి నెల్లూరులోనివే. బోగిలి, మర్రిపాడు, విడవలూరు, కోవూరు మండలాల్లో అసలు చుక్క కూడా పడలేదు. ఇక 319 మండలాల్లో నార్మల్‌, అంతకంటే ఎక్కువ వర్షం పడింది. రాష్ట్రంలో ఇప్పటికి సగటు నార్మల్‌ 80.4 మిల్లీమీటర్లు కాగా 69.4 మిమీ పడింది. సాధారణం కంటే 13.7 శాతం తక్కువ. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తక్కువ వర్షం కురిసింది. కృష్ణా, కర్నూలులో సాధారణ స్థాయిలో, అనంతపురం, కడప, చిత్తూరులో నార్మల్‌ కంటే ఎక్కువ వర్షం పడింది. అయితే జూన్‌ మొదట్లో ఈ వానలు పడ్డాయి.

వారం పది రోజుల నుండి అక్కడ వర్షాలు వెనకపట్టు పట్టాయి. వర్షానికి వర్షానికి మధ్య అంతరం (డ్రైస్పెల్‌) అంతకంతకూ పెరుగుతోంది. తొలుత పడ్డ వానలకు రైతులు అక్కడక్కడ భూములను సిద్ధం చేశారు. వేరుశనగ, పత్తి, ముందస్తు వరి, కొన్ని మెట్ట పంటలు విత్తారు. చాలా చోట్ల వానలు ముఖం చాటేయడంతో సాగును తాత్కాలికంగా నిలిపేశారు. గోదావరి డెల్టాకు పోలవరం స్పిల్‌వే నుండి ఇటీవలే నీరు వదిలారు. ఆ ప్రాంతంలో రైతులు వరి వరి నారుమళ్లకు సిద్ధమవుతున్నారు. ఇంకా కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయలేదు. ఈ ఏడాది వర్షాభావంతో పాటు కరోనా రెండవ వేవ్‌ సమస్య తీవ్రంగా ఉంది. వ్యవసాయ పనులకు కర్ఫ్యూ నుండి మినహాయింపులున్నప్పటికీ, దశలవారీగా కర్ఫ్యూ వేళల్లో సడలింపులిచ్చినప్పటికీ సాగు పనులు సాగట్లేదు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:347 Manda Lal has low rainfall

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *