Natyam ad

గూడూరులో ఘనంగా 34 వ రోడ్డు భద్రత వారోత్సవాలు

గూడూరు ముచ్చట్లు:


ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో రవాణా శాఖ, పోలీస్ శాఖ ల ఆధ్వర్యంలో 34 వ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా చేపట్టిన హెల్మెట్ బైక్ ర్యాలీని డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి రవీంద్రనాథ్ తదితరులు జెండా ఊపి ప్రారంభించారు.. వాహన చోదకులు హెల్మెట్ ధరించాలని, రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకే ఈ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని చెప్పారు.. వేగం కన్నా ప్రాణం ముఖ్యమని వారు వివరించారు.. పోలీసు, రవాణా శాఖ సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన ఈ అవగాహన ర్యాలీ గూడూరు కోర్టు సెంటర్ నుండి చిల్లకూరు వరకు కొనసాగింది.

 

Tags; 34th Road Safety Week celebrated in Gudur