37.10 lakhs revenue from municipal auctions

మున్సిపాలిటి వేలంపాటల్లో రూ.37.10 లక్షల ఆదాయం

– గత ఏడాది కంటే రూ.2.53 లక్షలు పెరిగింది.

Date:12/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటిలో వివిధ రకాల వేలంపాటలను కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించారు. 2020-2021 సంవత్సరం కాలం వేలం పాటల్లో వెహోత్తం రూ.37.10 లక్షలు ఆదాయం లభించినట్లు కమిషనర్‌ తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపాలిటి వారపు సంతను రూ.10.87 లక్షలకు వేలం వేశారు. గత ఏడాది దీని ద్వారా రూ.10.78 లక్షలు ఆదాయం వచ్చింది. అలాగే దినసరి కూరగాయల మార్కెట్‌కు రూ.10.80 లక్షలు ఆదాయం వచ్చింది. గత ఏడాది రూ.10.75 లక్షలు వచ్చింది. మున్సిపల్‌ బస్టాండుకు వచ్చే ప్రైవేటు వాహనాల లీజును రూ.9.89 లక్షలకు వేలం వేశారు. గత ఏడాది రూ.9.84 లక్షలు వచ్చింది. వీటితో పాటు పబ్లిక్‌ యూరినల్స్ రూ.5.54 లక్షలకు వేలం వేశారు. గత ఏడాది రూ.5.45 లక్షలు వచ్చింది. కాగా ఈ సారి పోటీ పెరిగిందని కమిషనర్‌ తెలిపారు. దీని ద్వారా రూ.2.53 లక్షలు అదనపు ఆదాయం లభించిందని తెలిపారు. నిబంధనల మేరకు వేలం పాటలు నిర్వహించగా అజ్ముతుల్లా అనే వ్యాపారి ఈ సారి కూడ వేలం పాటలను దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ వేలం పాటల్లో ఆర్‌వో రామకృష్ణ, ఆర్‌ఐ తిరుమలరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సఫ్ధర్‌ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ సారాతయారీపై ఎక్సెజ్‌ పోలీసులు దాడులు

Tags: 37.10 lakhs revenue from municipal auctions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *