3K run for police officers

పోలీస్ అధికారులకు 3కే రన్

Date:29/10/2020

జగిత్యాల  ముచ్చట్లు:

దివంగత అడిషనల్ ఎస్పీ దక్షిణా మూర్తి  స్మారకార్థం జిల్లా పరిధి లోని పోలీస్ అధికారులకు, సిబ్బందికి గురువారం జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం నుంచి 3కే రన్ నిర్వహించారు..ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ సింధు శర్మ హజరై జెండా ఊపి ప్రారంభించారు .ఈ 3కే రన్ మినీ స్టేడియం నుండి మొదలుకొని న్యూ బస్ స్టాండ్, వరకు న్యూ బస్ స్టాండ్  నుండి మినీ స్టేడియం వరకు కొనసాగింది.ఈ 3కే రన్  లో పోలీస్ అధికారులు, ఉమెన్ కానిస్టేబుల్స్,డిస్టక్ గార్డ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నియంత్రణ లో భాగంగా పోలీస్ శాఖ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉంటూ ప్రైమరీ కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారిని ఐసోలేషన్ ఉంచడం,వలస వెళ్లే వారికి సహాయాన్ని అందించడంలో జిల్లా  పోలీస్ శాఖ చాలా ఆక్టివ్ గా పని చేశారని, ఈ కరోనా వైరస్ ను ఎదుర్కొనే క్రమంలో భాగంగా చాలా మంది పోలీసులు వైరస్ బారిన పడి కోలుకోవడం జరిగిందని, దురదృష్టవశాత్తు అడిషనల్ ఎస్పీ  దక్షిణా మూర్తి మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు.జిల్లా పోలీసు శాఖలో ఉన్న వారి యొక్క ఫిట్నెస్ను క్రియేట్  చేయడానికి లైఫ్ టైం లో వచ్చే డిసీస్ నుండి  తమను తాము కాపాడుకోవడానికి ఈరోజు 3కె రన్ నిర్వహించడం జరిగిందని
ఈ 3k రన్ లో పోలీస్ అధికారులు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగిందని తెలిపారు.అనంతరం 3కే రన్ లో పాల్గొన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎస్పీ మెడల్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ  కె. సురేష్ కుమార్, డీఎస్పీ లు వెంకటరమణ,గౌస్ బాబా, ప్రతాప్,సి.ఐలు, ఆర్ఐ లు ఎస్.ఐ లు,ఉమెన్ కానిస్టేబుల్స్ ,డిస్టక్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం… రైతు మృతి

Tags: 3K run for police officers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *