Date:02/12/2020
విజయవాడ ముచ్చట్లు:
ఏపీ అసెంబ్లీ నుంచి 9 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. వరుసగా మూడో రోజు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. సీఎం జగన్ ప్రసంగానికి అడ్డుపడటంతో తొమ్మిది మంది సభ్యులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో అచ్చెన్నాయుడు, రామానాయుడు, రవికుమార్, బాల వీరాంజనేయస్వామి, జోగేశ్వరరావు, రామకృష్ణబాబు, అశోక్, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు ఉన్నారు.
Tags:3rd day suspension of TDP members