మే 3 నుండి 5వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి తెప్పోత్సవాలు
తిరుపతి ముచ్చట్లు:
దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 3 నుండి 5వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగనున్నాయి. స్వామి,అమ్మవార్లు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు రాత్రి 7 గంటలకు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.ఇందులో భాగంగా మే 3న శ్రీ కృష్ణ సమేత గోదాదేవి మూడు చుట్లు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు మే 4న ఐదు చుట్లు, మే 5న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారు
ఏడు చుట్లు తెప్పలపై తిరిగి కనువిందు చేయనున్నారు. ఈ మూడు రోజుల పాటు సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Tags:3rd to 5th May Teppotsavari of Lord Kadapa Sri Lakshmi Venkateswara Swamy
