పుంగనూరుకు 94 మంచినీటి ఆర్వో ప్లాంట్లకు రూ.4.70 కోట్లు
– మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి ల కృషి
పుంగనూరు ముచ్చట్లు:
నియోజకవర్గ ప్రజలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిల ఆదేశాల మేరకు ఐదు మండలాల్లో 94 ప్లాంట్లకు రూ.4.70 కోట్లు విడుదల చేసినట్లు మంగళవారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్ తెలిపారు. వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని పుంగనూరు రూరల్ మండలానికి 24 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుకు రూ.1.20 కోట్లు, చౌడేపల్లె మండలానికి 17 ప్లాంట్లకు రూ.85 లక్షలు, సోమల మండలానికి 12 ప్లాంట్లకు రూ.60 లక్షలు, సదుం మండలం 17 ప్లాంట్లకు రూ.85 లక్షలు, పులిచెర్ల మండలం 16 ప్లాంట్లకు రూ.80 లక్షలు, రొంపిచెర్ల మండలంలో 8 ప్లాంట్లకు గాను రూ. 40 లక్షలు విడుదలైందన్నారు. ఈ మేరకు 94 గ్రామాల్లో ప్లాంట్లను నిర్మించి , ఒకొక్క ప్లాంటుకు సుమారు రూ.5 లక్షలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఓవర్‌హెడ్ ట్యాంకుల వద్ద నిర్మాణాలు చేపట్టేలా మంత్రి సూచించారని తెలిపారు. త్వరలోనే మంత్రి , ఎంపీ చేతులు మీదుగా గ్రామీణ ప్రజలకు రక్షిత మంచినీటిని అందించే కార్యక్రమం చురుగ్గా నిర్వహిస్తామని తెలిపారు. ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఆర్వో ప్లాంట్ల నిర్మాణానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
Tags: 4.70 crores for 94 fresh water RO plants for Punganur