4ల‌క్ష‌ల‌ ఎల్.ఇ.డి లైట్ల మార్పిడి

-న‌గ‌రంలో స్ట్రీట్ లైట్ల‌న్నీ ఎల్‌.ఇ.డి లే
-దేశంలో ఎల్‌.ఇ.డి లైట్ల‌ను చేప‌ట్టిన అతిపెద్ద కార్పొరేష‌న్‌గా జీహెచ్ఎంసీ
Date:16/03/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
న‌గ‌రంలో ఉన్న 4,03,000 సాంప్ర‌దాయ‌క వీధి దీపాల స్థానంలో ఎల్‌.ఇ.డి లైట్ల‌ను అమ‌ర్చే అతిపెద్ద ప్ర‌క్రియ జీహెచ్ఎంసీలో దాదాపుగా పూర్తి అయ్యింది.  కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ ఎన‌ర్జీ ఎఫిసియెన్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఈ ఎల్‌.ఇ.డి బ‌ల్బుల మార్పిడి కార్య‌క్ర‌మంలో భాగంగా  నేటి వ‌ర‌కు 4ల‌క్ష‌ల ఎల్.ఇ.డి లైట్ల‌ను అమ‌ర్చారు. 2017 జూలై మాసంలో ప్రారంభించిన ఈ ఎల్‌.ఇ.డి లైట్ల ప్రాజెక్ట్ మ‌రో కొద్ది రోజుల్లో పూర్తికానుంది. వీధి లైట్ల‌ను ఎల్‌.ఇ.డి లైట్ల‌తో మార్పిడి అనంత‌రం న‌గ‌రంలో ఉన్న అన్ని జీహెచ్ఎంసీకి చెందిన ఉద్యాన వ‌నాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, శ్మ‌శాన‌వాటిక‌లలో కూడా ఎల్‌.ఇ.డి లైటింగ్ మార్పిడి ప్ర‌క్రియ పురోగ‌తిలో ఉంది. స్ట్రీట్ లైట్లు, ఇత‌ర ప్రాంతాల్లో మొత్తం 4,53,000 విద్యుత్ దీపాల‌ స్థానంలో ఎల్‌.ఇ.డి బ‌ల్బుల‌ను అమ‌ర్చ‌డం ద్వారా సంవ‌త్స‌రానికి  162.15 మిలియ‌న్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. త‌ద్వారా జీహెచ్ఎంసీకి రూ. 115.13కోట్ల విద్యుత్ బిల్లు ఆదా అవుతోంది. దీంతో పాటు సంవ‌త్సారానికి 1,29,719 ట‌న్నుల కార్బ‌న్ డై ఆక్సైడ్ విడుద‌ల కూడా త‌గ్గ‌నుంది. న‌గ‌రంలో ఉన్న సాంప్రదాయ విద్యుత్ దీపాల స్థానంలో ఎల్.ఇ.డిలైట్ల‌ను అమ‌ర్చే అతిపెద్ద మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌గా దేశంలో జీహెచ్ఎంసీ నిలిచింది. కాగా  న‌గ‌రంలోని ప‌లు ప్ర‌ధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన ఎల్‌.ఇ.డి లైట్ల‌తో ఆయా వీధులు అద‌న‌పు కాంతితో ప్ర‌త్యేకంగా క‌నిపిస్తున్నాయి. ఎల్‌.ఇ.డి లైట్ల వ‌ల్ల రాత్రివేళ‌లో ప్ర‌మాదాలు కూడా త‌గ్గాయ‌ని పలువురు పేర్కొన్నారు.
  ఈ సంవ‌త్స‌రాంతంలోగా  హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న సాంప్ర‌దాయ‌క వీధి దీపాల స్థానంలో ఎల్‌.ఇ.డి లైట్ల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు జీహెచ్ఎంసీకీ ల‌క్ష్యాన్ని నిర్థారించారు. ఈ ల‌క్ష్యానికి అనుగుణంగా  జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్న 4.53ల‌క్ష‌ల‌ సాంప్ర‌దాయ‌క వీధి దీపాల స్థానంలో ఎల్‌.ఇ.డి లైట్ల‌ను అమ‌ర్చే అతిపెద్ద ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ ఎన‌ర్జీ ఎఫిసియెన్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఈ ఎల్‌.ఇ.డి బ‌ల్బుల మార్పిడి కార్య‌క్ర‌మంలో భాగంగా  నేటి వ‌ర‌కు 4,00,022 బ‌ల్బులకుపైగా ఎల్‌.ఇ.డి లైట్ల‌ను అమ‌ర్చారు. ప్ర‌స్తుతం అమ‌ర్చిన ఈ  ల‌క్ష‌కు పైగా ఎల్.ఇ.డి బ‌ల్బుల వ‌ల్ల రోజుకు 3,79,329 యూనిట్ల‌ విద్యుత్ ఆదా అవుతుంది.  యూనిట్‌కు 7 రూపాయ‌ల చొప్పున రోజుకు మొత్తం 26.3ల‌క్ష‌ల‌ రూపాయ‌ల విద్యుత్ ఆదా అవుతోంది. అంటే మొత్తం  4,55,000 విద్యుత్ దీపాల‌ స్థానంలో ఎల్‌.ఇ.డి బ‌ల్బుల‌ను అమ‌ర్చ‌డం ద్వారా సంవ‌త్స‌రానికి  162.15 మిలియ‌న్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. త‌ద్వారా జీహెచ్ఎంసీకి రూ. 115.13కోట్లు విద్యుత్ బిల్లు ఆదా కానుంది. దీంతో పాటు సంవ‌త్సారానికి 1,29,719 ట‌న‌న్నుల కార్బ్‌డ‌యాక్సైద్ విడుద‌ల త‌గ్గ‌నుంది. కాగా  నేటి వ‌ర‌కు అమ‌ర్చిన 4,00,022 ఎల్‌.ఇ.డి విద్యుత్ దీపాల్లో 18వాట్స్‌, 35 , 70, 110, 190 వాట్స్ కెపాసిటీ క‌లిగిన విద్యుత్ దీపాలు ఉన్నాయి. కాగా  న‌గ‌రంలోని ప‌లు ప్ర‌ధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన ఎల్‌.ఇ.డి లైట్ల‌తో ఆయా వీధులు అద‌న‌పు కాంతితో ప్ర‌త్యేకంగా క‌నిపిస్తున్నాయి. ఎల్‌.ఇ.డి లైట్ల వ‌ల్ల రాత్రివేళ‌లో ప్ర‌మాదాలు కూడా త‌గ్గాయ‌ని పలువురు పేర్కొన్నారు.
ఎల్.ఇ.డి ప్రాజెక్ట్‌ను చేప‌ట్టిన అతిపెద్ద కార్పొరేష‌న్ జీహెచ్ఎంసి
దేశంలోని మొత్తం ప్ర‌ధాన న‌గ‌రాల్లోని సాంప్ర‌దాయ‌క వీధి దీపాల స్థానంలో ఎల్‌.ఇ.డి లైట్ల‌ను అమ‌ర్చే ప్ర‌క్రియ‌ను చేప‌ట్టిన అతిపెద్ద కార్పొరేష‌న్ జీహెచ్ఎంసీ రికార్డు సృష్టించనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ద‌క్ష‌ణ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అత్య‌ధికంగా రెండు ల‌క్ష‌ల విద్యుత్ దీపాల స్థానంలో ఎల్‌.ఇ.డి లైట్ల‌ను అమ‌ర్చింది. దీంతో పాటు విశాఖప‌ట్నం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ల‌క్ష ఎల్‌.ఇ.డి లైట్ల‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ రెండు కార్పొరేష‌న్లు ఎల్‌.ఇ.డి బ‌ల్బుల‌ను అమ‌ర్చ‌డానికి సంవ‌త్స‌ర‌కాలం తీసుకున్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో జూన్ మాసంలో ప్రారంభ‌మైన ఎల్‌.ఇ.డి లైట్ల మార్ప‌డి ప్ర‌క్రియ‌ను టెండ‌ర్ల పూర్తి, మ్యాన్‌ప‌వ‌ర్‌, ట్రాఫిక్ క్లీయ‌రెన్స్‌, వాహ‌నాలు, ల్యాడ‌ర్లు, వ‌ర్క‌ర్ల సేక‌ర‌ణ పూర్తి చేసి జులై రెండ‌వ వారంలో ప్రారంభించింది. కేవ‌లం తొమ్మిది నెల‌ల‌ వ్య‌వ‌ధిలోనే న‌గ‌రంలో  ఇప్ప‌టి వ‌ర‌కు 4,00.022 ఎల్‌.ఇ.డి లైట్ల‌ను ఏర్పాటు చేసింది.
న‌గ‌రంలో ఉన్నసాంప్ర‌దాయ‌ విద్యుత్ దీపాల ద్వారా సంవ‌త్స‌రానికి రూ. 252.89కోట్ల రూపాయ‌లు నిర్వ‌హ‌ణ వ్య‌యంగా జీహెచ్ఎంసీ చెల్లిస్తోంది. ఎల్‌.ఇ.డి లైట్ల మార్పి అనంత‌రం ఈ విద్యుత్ వినియోగ చార్జీలు రూ. 105.38కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే చెల్లించాల్సి ఉంటుంది. అంటే సంవ‌త్స‌రానికి 58.33శాతం విద్యుత్ వినియోగం త‌గ్గ‌నుంది. ఈ త‌గ్గిన విద్యుత్ వినియోగం ద్వారా ఆదాయం మొత్తాన్ని ఇఇఎస్ఎల్ సంస్థ‌కు ఏడేళ్ల పాటు జీహెచ్ఎంసీ చెల్లించ‌నుంది. ఈ సాంప్ర‌దాయ‌క విద్యుత్ దీపాల స్థానంలో ఎల్.ఇ.డిల‌ను అమ‌ర్చినందున జీహెచ్ఎంసీకి ఏవిధ‌మైన భారం లేక‌పోవ‌డంతో పాటు విద్యుత్ ఆదా ద్వారా ల‌భించిన మిగులు నిధుల‌నే ఇఇఎస్ఎల్ సంస్థ‌కు చెల్లించ‌నుంది.
ఎల్‌.ఇ.డి ప్రాజెక్ట్ వివ‌రాలు
* ప్రాజెక్ట్ మొత్తం వ్య‌యం రూ. 217.12 కోట్లు
* ఎల్‌.ఇ.డి ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ ఆదా  55శాతం
* ఏడేళ్ల పాటు ఎల్.ఇ.డి ప్రాజెక్ట్ నిర్వ‌హ‌ణ‌ను కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ ఇఇఎస్ఎల్ చేప‌డుతోంది.
* ఈ ప్రాజెక్ట్‌కు జీహెచ్ఎంసీ నిధులు పెట్టుబ‌డి అవ‌స‌రంలేదు.
* విద్యుత్ బిల్లుల ఆదా ద్వారా ల‌భించిన నిధుల‌నే ఇఇఎస్ఎల్‌కు జీహెచ్ఎంసీ చెల్లించ‌నుంది.
* 98శాతం బ‌ల్బులు త‌ప్ప‌నిస‌రిగా వెలుగుతాయి.
* స్వీచ్‌ల ఆన్ ఆఫ్ లు ఆటోమిటిక్‌గా అవుతాయి.
* నేష‌న‌ల్ లైటింగ్ కోడ్ (ఎన్‌.ఎల్‌.సి) ప్ర‌కారం ప్ర‌తి వీధుల‌కు స‌రిప‌డ విద్యుత్ కాంతి ఉండేలా చూడ‌టం జ‌రుగుతుంది.
* 24,962ఆన్/ ఆఫ్ స్విచ్‌ల‌కుగాను 15,363 ఆటోమెటిక్ స్విచ్‌ల‌ను అమ‌ర్చ‌డం జ‌రిగింది.
* త్వ‌ర‌లో మిగ‌తాయి కూడా బిగించ‌బ‌డ‌తాయి. దీని వ‌ల్ల స‌న్‌సెట్‌/స‌న్‌రైస్ ప్ర‌కారం ఆన్/ఆఫ్ అవుతాయి.
Tags: 4 lakh LDT lights exchange

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *