Natyam ad

నోటీసులు లేకుండా 4000 మంది తొలగింపు

న్యూయార్క్ ముచ్చట్లు:

తాజాగా ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఎలాంటి నోటీసులు లేకుండా 4000 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. ఎలాన్ మస్క్ నిర్ణయంపై జాబ్ కోల్పోయిన ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. దాదాపుగా 4,400 మంది కాంట్రాక్టు ఉద్యోగులు తమ అధికార మెయిల్, ఆన్‌లైన్ సేవల యాక్సెస్ కోల్పోయారు.మొత్తం ట్విట్టర్ లో 5,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే వారిలో 4400 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. ఈ తొలగింపులు కంటెంట్ నియంత్రణ, సైట్ ను అప్‌డేట్, రన్నింగ్‌ లో ఉంచే కీలక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ లో 50 శాతం ఉద్యోగులను అంటే దాదాపుగా 3700 మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు .

 

 

Post Midle

ఎలాన్ మస్క్. భారతదేశంలో 90 శాతం మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ నిర్ణయం తీసుకున్న వారానికి తాజాగా 4వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు.44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు ఎలాన్ మస్క్. వచ్చీ రావడంతోనే సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ తో పాటు పాలసీ చీఫ్ విజయ గద్దెలతో పాటు మరికొంత మంది ఉద్యోగులను తొలగించారు. దీంతో పాటు ట్విట్టర్ బోర్డును రద్దు చేసి తానే ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు. వెరిఫైడ్ ఖాతాలకు నెలకు 8 డాలర్లు (భారత్ లో రూ. 719) వసూలు చేస్తామని అధికారికంగా ఎలాన్ మస్క్ ధృవీకరించారు. దీంతో పాటు రానున్న కాలంలో మరిన్ని పెయిడ్ సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Tags: 4000 layoffs without notices

Post Midle

Leave A Reply

Your email address will not be published.