పుంగనూరులో 4జి సేవలు ప్రారంభం

4G services start at Punganur

Date:15/04/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో భారతసంచార నిఘం ఆధ్వర్యంలో 4జి సేవలు ప్రారంభించినట్లు టెలికాం డీఈ గిరిధర్‌ సోమవారం తెలిపారు. ఆయన బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో 4 జి సేవలు ప్రారంభించి మాట్లాడుతూ పుంగనూరులో 4జి సేవలు ప్రారంభించడం హర్షనీయమన్నారు. వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని, 4జి సేవలను పుంగనూరులో ప్రారంభించడం జరిగిందన్నారు. 4జి సేవలు వినియోగించుకునే వినియోగదారులు వెంటనే తమ వెహోబైల్‌సిమ్‌కార్డులను కార్యాలయంలో అందించి, 4జి సిమ్‌కార్డులు పొందాలని కోరారు. 4జి ఇంటర్నేనెట్‌ సేవలను త్వరలోనే గ్రామీణ ప్రాంతాలకు కూడ విస్తరింప చేయనున్నట్లు ఆయన తెలిపారు. ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ వినియోగదారులకు 5జిబి ఇంటర్నేనెట్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ల్యాండ్‌లైన్లకు, ఫోన్లకు వివిధ రకాల సబ్సిడి రేట్లను ప్రభుత్వం ప్రకటించిందని, వాటిని వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు బిఎస్‌ఎన్‌ఎల్‌ అభివృద్ధి కోసం భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణ వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. పుంగనూరులో 4జి సేవలు అందించేందుకు టెలికాం డీఈ గిరిధర్‌ ఆధ్వర్యంలో్య ధికారులు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు.

 

అమ్మచెంతన దాహం కేకలు  

Tags: 4G services start at Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *