20ఎర్రచందనం దుంగలతో 5గురు అరెస్టు
-ఒక కారు, మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం
అన్నమయ్య ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా సుండుపల్లి వద్ద పించా డ్యాంకు సమీపంలో ఎర్రచందనం దుంగలను కారులో లోడ్ చేస్తున్న 5గురిని అరెస్టు చేసి, వారి నుంచి 20ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగలు ఎక్కిస్తున్న కారును, మరో మూడు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ జి. చెంచుబాబు అధ్వర్యంలో రిజర్వు ఇనస్పెక్టర్ కే.సురేశ్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ విశ్వనాథ్ టీమ్ తిరుపతి కార్యాలయం నుంచి బయలుదేరింది. వీరు అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజ్, జిల్లేళ్ల మంద అటవీ పరిధిలోని పింఛా డ్యాం వద్ద కూంబింగ్ చేస్తుండగా, మంగళవారం ఒక కారులో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు. వారిని చుట్టుమట్టి పరిశీలించగా కారులో 10, కారు సమీపంలో మరో 10ఎర్రచందనం దుంగలు లభించాయి. కారులో లోడ్ చేస్తున్న తమిళనాడు తిరువన్నామలై జిల్లా పోలూరు తాలూకాకు చెందిన బాలు (36), సీ.కృష్ణన్ (30), వేలూరు జిల్లా ఆనైకట్టుకు చెందిన ప్రభు శంకరన్ (29), ప్రభు జయరామన్ (33), ఎస్. అరుల్ (20)లను అరెస్టు చేశారు. వీరి నుంచి 20ఎర్రచందనం దుంగలతో పాటు, కారు, మూడు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను ఎఫ్ఆర్ఒ ఏ.ప్రేమ ధృవీకరించారు. టాస్క్ పోర్సు పోలీసు స్టేషన్ ఎస్ఐ మోహన్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీటి విలువ రూ.కోటి వరకు ఉండవచ్చునని అంచనా వేశారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిని కర్నూల్ రేంజి డీఐజీ సెంథిల్ కుమార్ అభినందించి, రివార్డులు ప్రకటించారు.
Tags:5 arrested with 20 red sandalwood logs
