తెలంగాణ  ప్ర‌భుత్వ ద‌వాఖానాల‌కు 5జాతీయ అవార్డులు

– వరుసగా ముచ్చటగా మూడో సారి
Date:21/04/2018
హైద‌రాబాద్ ముచ్చట్లు:
వైద్యం, పారిశుద్ధ్యం, బ‌యో కెమిక‌ల్ వేస్టేజీ మేనేజ్‌మెంట్‌లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాలు పాటిస్తూ, ప్ర‌జ‌ల‌కు మెరుగైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన సేవ‌లు అందిస్తున్న తెలంగాణ‌లోని ఐదు ది బెస్ట్ ప్ర‌భుత్వ ద‌వాఖానాల‌ను ఎంపిక చేసిన కేంద్ర ప్ర‌భుత్వం అవార్డులు ఇచ్చి ఘ‌నంగా స‌త్క‌రించింది. కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి న‌డ్డా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ అవార్డులు ఢిల్లీలో అంద‌చేయ‌డ‌మేగాక‌,  ప్ర‌త్యేకంగా ఆయా వైద్య‌శాల‌ల సిబ్బందిని, అందుకు ప్రోత్స‌హిస్తూ, అనువైన స‌దుపాయాలు క‌ల్పిస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వాన్ని అభినందించారు. ప్ర‌భుత్వ వైద్య రంగంలో వైద్యం-పారిశుద్ధ్యం-బ‌యోకెమిక‌ల్ వేస్టేజీలో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాలు పాటిస్తూ, వైద్‌్శాల‌ల ముఖ చిత్రాల‌ను అద్భుతంగా తీర్చిదిద్ది, ప్ర‌జ‌ల‌కు మంచి వైద్య సేవ‌లు అందిస్తున్న దేశ వ్యాప్త 31 రాష్ట్రాల‌లోని స‌ర్కార్ ద‌వాఖానాలలో ది బెస్ట్ ద‌వాఖానాల‌ను ఎంపిక చేసి *కాయ క‌ల్ప‌* అవార్డులిస్తున్న‌ది కేంద్ర ప్ర‌భుత్వం. గ‌త మూడేళ్ళుగా నిర్వ‌హిస్తున్న ఈ పోటీల్లో ఈ ఏడాది కూడా తెలంగాణలోని ఐదు స‌ర్కార్ ద‌వాఖానాలు మూడు కేట‌గిరీలో ఎంపికై అవార్డులు ద‌క్కించుకున్నాయి. జిల్లా ద‌వాఖానాల కేట‌గిరీలో ఖ‌మ్మం, హైద‌రాబాద్‌లోని కింగ్ కోఠీ ద‌వాఖానాలు, ఏరియా ద‌వాఖానాల కేట‌గిరీలో బాన్స్‌వాడ, భ‌ద్రాచ‌లం, సామాజిక వైద్య‌శాల‌ల కేట‌గిరీలో ములుగు ద‌వాఖానాలు అవార్డులు ద‌క్కించుకున్నాయి. మొద‌టి కేట‌గిరీ కింద రూ.50 ల‌క్ష‌లు, రెండో కేట‌గిరీ కింద రూ.25 ల‌క్ష‌లు, మూడో కేట‌గిరీ కింద రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దు పారితోషికంతోపాటు, అభినంద‌న ప‌త్రం, జ్ఞాపిక‌ల‌ను అంద‌చేస్తున్న‌ది. ఈ మేర‌కు నిన్న ఢిల్లీలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో కేంద్ర వైద్య శాఖ మంత్రి జెపి న‌డ్డా సంబంధిత వైద్య‌శాల‌ల‌కు ఆయా అవార్డులు ఇచ్చారు.
*వరుసగా, ముచ్చటగా మూడో సారి…*
కాగా, క్యాష్ ప్రైజ్‌లో 25శాతం సిబ్బందికి, 75శాతం ఆయా వైద్య‌శాల‌ల అభివృద్ధికి వినియోగించుకునే విధంగా కేంద్ర ప్ర‌భుత్వం ఈ అవార్డుని తీర్చిదిద్దింది. గ‌తంలోనూ ఈ అవార్డుల‌ని ఖ‌మ్మం, కింగ్ కోఠీ, సంగారెడ్డి, ఖ‌మ్మం వైద్య‌శాల‌లు ద‌క్కించుకోవ‌డం విశేషం. తెలంగాణ వైద్యశాలలకు వరసగా, ముచ్చటగా మూడోసారి ఈ అవార్డులు వచ్చాయి.ఇదిలా వుండ‌గా జాతీయ స్థాయి అవార్డులు వ‌ర‌స‌గా ద‌క్కించుకుంటున్న ఆయా వైద్య‌శాల‌ల సూప‌రింటెండెంట్లు, వైద్య సిబ్బందిని వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అభినందించారు. ఈ సారి కూడా ఆ ఒర‌వ‌డిని కొన‌సాగిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ముందు కూడా ఇలాగే మ‌రిన్ని అవార్డులు రావాల‌ని ఆకాంక్షించారు. అలాగే సిఎం కెసిఆర్ ఆరోగ్య‌శాఖ కు నిధులు ఇస్తూ, పేద‌ల‌కు మంచి వైద్యం అందేలా ప్రోత్స‌హిస్తూ, ముందుకు న‌డుపుతున్నందునే ఇలాంటి అవార్డులు సాధ్య‌మ‌వుతున్నాయ‌ని కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
Tags:5 National Awards for Telangana Government Diwali

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *