Natyam ad

అందుబాటులోకి  5 జీసేవలు….14 నగరాల్లో కనెక్షన్లు

న్యూఢిల్లీ ముచ్చట్లు:


ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 5జీ సేవలను ప్రారంభించారు. శనివారం ఉదయం ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఆరో ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన ఆయన.. 5జీ సేవలను సైతం ప్రారంభించారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022 నేటి నుంచి అక్టోబర్ 4 వరకు ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరగనుంది. ఎయిర్‌టెల్, జియో, వీఐ టెలీకాం సంస్థలు ప్రధాని మోదీకి 5జీ సేవలకు సంబంధించి డెమో ఇచ్చాయి. 5జీ సేవలను ముందుగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ తదితర 13 నగరాల్లో ముందుగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత దశల వారీగా దేశమంతటా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. 4జీ సేవలతో పోలిస్తే 5జీ టెక్నాలజీతో 7-10 రెట్ల స్పీడ్‌తో ఇంటర్నెట్‌ను పొందొచ్చు.అత్యున్నత క్వాలిటీతో వీడియోలు చూడటంతోపాటు. టెలీసర్జరీ, అటానమస్ కార్లు తదితర సేవలను 5జీ సర్వీసులతో తేలిగ్గా పొందొచ్చు. విపత్తుల సమయంలో రియల్ టైం మానిటరింగ్, వ్యవసాయరంగంలో మార్పులు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ప్రదేశాల్లో మనుషుల పాత్రను తగ్గించడం లాంటివి 5జీ సేవలతో సాధ్యమవుతాయి. 5జీ సేవల ప్రారంభోత్సవం సందర్భంగా స్వీడన్‌లో ఉన్న కారును ప్రధాని మోదీ ఎరిక్‌సన్ బూత్‌ నుంచి వర్చువల్‌గా నడిపారు.5జీ సేవల కోసం జియో, ఎయిర్‌టెల్, వీఐ సంస్థలు రూ.1.5 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. జియో రూ.88,078 కోట్లను స్పెక్ట్రమ్ కోసం ఖర్చు చేయగా..

 

 

ఎయిర్‌టెల్‌ రూ.43,084 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.18,799 కోట్లు ఖర్చు చేశాయి. తక్కువ వ్యవధిలోనే దేశంలోని 80 శాతం ప్రాంతంలో 5జీ సేవలను అందుబాటులోకి తేవాలని టెలీకాం సంస్థలకు ప్రభుత్వం లక్ష్యాన్ని విధించింది.5జీ సేవలతో నూతన ఆర్థికావకాశాలు, సామాజిక ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. అభివృద్ధి పథంలో దేశం దూసుకెళ్లడానికి 5జీ సేవలు ఉపయోగపడనున్నాయి. 2023 నుంచి 2040 మధ్య 5జీ సేవలతో దేశ ఆర్థిక వ్యవస్థకు 36.4 లక్షల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరుతుందని అంచనా.G సేవలతో హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా అందుబాటులోకి రానుంది. ఇది కేవలం ఇంటర్నెట్ స్పీడ్‌కే పరిమితం కాకుండా, ఇది ఆటోమేషన్‌ను కొత్త దశకు తీసుకువెళుతుంది. భారతీయ టెలికాం పరిశ్రమకు చెందిన రెండు పెద్ద దిగ్గజాలు ఈ ఏడాది తమ 5జీ సేవలను ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించాయి. ఈ సాంకేతికత ప్రధానంగా రెండు మోడ్‌లపై ఆధారపడి ఉంటుంది. అవి ఇండిపెండెంట్ అండ్ నాన్-స్టాండలోన్ గా ఉంటాయి. విశేషమేమిటంటే 5G నెట్‌వర్క్‌ డేటా వేగం 4G కంటే చాలా రెట్లు ఎక్కువ వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి అంతరాయం లేకుండా మెరుగైన కనెక్టివిటీని కలిగి ఉంటుంది.డేటాను పంచుకునేందుకు వీలుగా బిలియన్ల కొద్దీ కనెక్ట్ చేసిన పరికరాలను దీనికి అనుసంధానించనున్నాయి. ఈ మొదటి దశ సేవలు అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే నగరాలు ఉన్నాయి.

 

Post Midle

Tags: 5 services available….connections in 14 cities

Post Midle

Leave A Reply

Your email address will not be published.