Natyam ad

అరగంటలో 5వేల పిడుగులు

భువనేశ్వర్,   ముచ్చట్లు:

 

 

 

వర్షాకాలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవడం చూస్తుంటాం.. అలాంటి సమయంలో పలు చోట్ల పిడుగులు కూడా పడుతూ ఉంటాయి. మనం కూడా పిడుగు పాటుకు జనాలు ప్రాణాలు కోల్పోయిన వార్తలు చూస్తూ ఉంటాం కానీ ఒక ప్రాంతంలో ఏకంగా 5,450 పిడుగులు పడ్డాయి. అదికూడా అరగంట వ్యవధిలో.. పిడుగుపాటు శబ్దాలకు భూమి దద్దరిల్లింది.. ప్రజలు భయంతో పరుగులు పెట్టారా.. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..ఒడిశాలోని భద్రక్‌ జిల్లా బాసుదేవపూర్‌లో సాయంత్రం ఆకాశం కన్నెర్ర జేసింది.

 

 

 

Post Midle

కేవలం అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు పడ్డాయి. వరుసగా పిడుగులు పడుతుండటంతో జనాలు దిక్కుతోచక పరుగులు పెట్టారా..ప్రాణ, ఆస్తి నష్టం లేకపోయినప్పటికీ పిడుగుపాటు శబ్దాలకు బాసుదేవపూర్‌ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇక ఇలా పిడుగులు ఎందుకు పడ్డాయో ఐఎండీ అధికారులు వివరించారు. క్యుములోనింబస్‌ మేఘాలు రాపిడికి గురైనపుడు ఇలా జరుగుతుందని గోపాల్‌పూర్‌ డాప్లార్‌ రాడార్‌ కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ తెలిపారు. ఇలా జరగడం మొదటి సారి కాదని గతంలో కూడా జరిగాయని తెలిపారు. పిడుగుపాటును గుర్తించే అత్యాధునిక సాంకేతికత రాడార్‌ తమ కేంద్రానికి ఉందని ఆయన తెలిపారు. ఏదిఏమైనా ఇలా పిడుగులు పడటంతో జనాలవెన్నులో వణుకు పుట్టింది.

Tags;5 thousand thunders in half an hour

Post Midle