సంగారెడ్డి పట్టణ అభివృద్దికోసం 50 కోట్లు-మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి ముచ్చట్లు:

సంగారెడ్డి లో 50 కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు మంగళవారం నాడు శంకుస్థాపన చేసారు.  తరువాత అయన పైలాన్ ను ఆవిష్కరించారు.
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలో 50 కోట్లతో అన్ని వార్డుల మౌలిక సదుపాయాలు కోసం శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సంగారెడ్డి పట్టణంలో అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 50 కోట్లు నిధులు కేటాయించారు. టెండర్లు పిలిచి త్వరగా పనులు మొదలు పెట్టాలి. 15 కోట్లతో తాగునీరు కోసం 4 వాటర్ ట్యాంక్ నిర్మించి ఇంటి ఇంటి కి తాగునీరు ఇచ్చే పథకం ప్రారంభం  చేసాము. సంగారెడ్డి మున్సిపాలిటీ లో  ఇక తాగునీటి సమస్య ఉండదు .500 కోట్లతో 650 పడకల తో మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతుంది. సీఎం కేసీఆర్ వల్లనే సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ మంజూరు అయింది. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ ప్రారంభం జరుగుతుంది. అన్ని వసతుల తో  సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో ఉచిత వైద్యం అందిస్తున్నాము. కొత్త డెయిట్ పాలసీ తో ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఆరోగ్యకరమైన భోజనం ఉచితంగా ఇస్తున్నాము. సంగారెడ్డి మున్సిపాలిటి లో 4 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్  నిర్మాణం జరుగుతుందని అన్నారు.

 

 

 

వచ్చే రెండు నెలల్లో   57 ఏళ్ల నిండిన వారికి కొత్తగా పది లక్షల పెంచన్లు ఇవ్వబోతున్నము. త్వరలోనే సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం  కు ప్రభుత్వ సహాయం చేస్తాము. మోడీ ఉచితలు వద్దు అని అంటున్నాడు… కల్యాణ లక్ష్మీ, తో సహా తెలంగాణ లో పేదల కోసం అమలు చేస్తున్న  అన్ని పథకాలకు వద్దు అని అంటున్నారా. బీజేపీ ప్రభుత్వం పేదల సంపదను దోచి నీరవ్ మోడీ లాంటి గజ దొంగలకు రుణమాఫీ చేస్తున్నాడు. బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రలలో పేదల సంక్షేమ పథకాలు అమలు చేయకుండా విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షలు వరద లో బురద రాజకీయాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ క్షేత్ర స్థాయి లో  జిల్లాల పర్యటన చేసి ప్రజలకు భరోసా ఇస్తున్నారు. చరిత్ర లో ఎక్కువ వర్షపాతం నమోదు అయిన ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నాము. వరదలు వచ్చిన కేంద్రం ఒక్క రూపాయి నష్ట పరిహారం ఇవ్వలేదు. బీజేపీ నాయకులు కేంద్రం నుండి నిధులు తెచ్చి పేదలకు సహాయం చేయండి. త్వరలో సంగారెడ్డి లో కొత్తగా మరిన్ని బస్తి దవాఖానలు ప్రారంభమ్ చేస్తామని మంత్రి అన్నారు.

 

Tags: 50 crores for the development of Sangareddy town- Minister Harish Rao

Leave A Reply

Your email address will not be published.