మరియమ్మ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
తెదేపా వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జ్ చాడ మరియ (సురేఖ)

వర్ధన్నపేట    ముచ్చట్లు:
పోలీసుల దాష్టీకానికి చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన దళిత మహిళ మరియమ్మ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసు స్టేషన్ లో లాకప్ డెత్ కు గురి కావడం విచారకరమని,దళిత మహిళ మరియమ్మ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను తక్షణమే ప్రకటించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని,హత్యకు పాల్పడిన వారిపై ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్యానేరం కేసులను నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తెదేపా వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జ్ చాడ మరియ(సురేఖ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని అంబేద్కర్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చాడ మరియ (సురేఖ) మాట్లాడుతూ దళితులపైన జరుగుతున్న దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సమాజంలో అగ్రకుల ఆధిపత్య దాడులు ఒకపక్క పెరిగిపోతుంటే వాటిని అరికట్టాల్సిన పోలీసులే దళిత మహిళను అతిక్రూరంగా చిత్రహింసలకు గురి చేసి పోలీసులు కొట్టిన దెబ్బలకి పెట్టిన హింసలకు మరియమ్మ ఈనెల 18న అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులు కుళ్లపొడిచి హత్య చేయడం దుర్మార్గమని,అంతటితో ఆగకుండా ఆమె కుమారుడైన ఉదయ్ కిరణ్ ని వెన్నుముక కింది భాగంలో దారుణంగా కుల్లపొడిచి అవయవాల పైన గాయపర్చి హత్యాయత్నం చేయడం శోచనీయమన్నారు.మరియమ్మ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించి,ఆమె కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలన్నారు. మరియమ్మ మృతి పట్ల సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:50 lakh ex gratia should be given to Mariamma family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *