బిసి లకు చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

50% reservation in the legislative body for BCs

50% reservation in the legislative body for BCs

ఈ నెల 28 న హైదరాబాదు లో లక్షలాది మందితో భారీ సభ
Date:08/10/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
బిసి లకు చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఈ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు బి.సి లకు 65 అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28 న హైదరాబాదు లో లక్షలాది మంది బీసీలతో భారీ భహిరంగ సభ జరుపాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం నిర్ణయించింది. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఈ రోజు బిసి సంక్షేమ సంఘం కోర్ కమిటి చర్చించింది. సభను పెరేడ్ గ్రౌండ్ లో జరుపాలా, నగరం బయట ఒక పెద్ద స్థలం, లేదా సరూర్ నగర్ స్టేడియంలో జరుపాల  అనే అంశం పై చర్చ జరిగింది. ఈ సభకు తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి కూడా బిసి  ప్రజలు పాల్గొంటారని కృష్ణయ్య తెలిపారు.
సభకు ముఖ్య అతిధిగా తెలంగాణ ముఖ్యమంత్రి, కేసీఆర్, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ మూర్తి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి  సిద్దా రామయ్య, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్  యాదవ్, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్, కేంద్ర మంత్రులు, రెండు రాష్ట్రాల మంత్రులను ఆహ్వానించాలని నిర్ణయించారు. స్వాతంత్రo వచ్చి 71 ఏళ్లు గడిచినా బిసి లకు రాజ్యాంగ బద్దమైన హక్కులు కల్పించకుండ అన్యాయం చేశారు. బిసి సంక్షేమ సంఘం చేసిన 10 వేలకు పైగా ధర్నాలు, ర్యాలీలు, ప్రదర్శనల మూలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక స్కీములు పెట్టడం జరిగింది.
ప్రత్యేకంగా 6 వేల ఎస్సీ/ఎస్టీ/ బీసీ  హాస్టళ్ళు, 1200 రెసిడెన్షియల్ పాటశాలలు ప్రారంభించడం మూలంగా 12 లక్షల మంది 3 వ తరగతి నుండి సీజీ  వరకు అన్ని సౌకర్యాలతో ఉచితంగా చదువుకుంటున్నారు. అలాగే ఫీజుల రియంబర్స్ మెంట్ స్కీముల వలన 30 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ నుంచి పీజీ  వరకు, అలాగే ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడిసన్ లాంటి వృత్తి విద్య కోర్సుల వరకు ఉచితంగా చదువుకుంటున్నారు. అలాగే ర్యాంకు స్కాలర్ షిప్ లు, విదేశీ  “స్టై ఫండు”,  12 బిసి కుల ఫెడరేషన్లు, సబ్సిడీ రుణాలు, స్థానిక సంస్థలలో 34 శాతం రిజర్వేషన్లు, ప్రైవేటు వృత్తివిద్య సంస్థలలో 25 శాతం రిజర్వేషన్లు ప్రవేశ పెట్టించి 2 వేలకు జీవోలు  తెప్పించడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని స్కీములు తెలుగు రాష్ట్రాలలో పెట్టించడం జరిగింది.
అయితే ఇవి ఇతర రాష్ట్రాలలో లేవు. కేంద్ర స్థాయిలో కూడా లేవు. అన్ని రాష్ట్రాలలో పెట్టించడానికి పోరాటం చేయాలని నిర్ణయించారు. బిసి లకు గత 71 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుంది. ఇంకా జరుగకుండ పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలిసిన ఆవశ్యకత ఉంది. అందుకే దేశంలోని ప్రముఖ నాయకులందరిని కలుపుకొని పోరాటం చేయవలిసిన ఆవశ్యకత ఏర్పడింది. బిసి లకు అన్ని రంగాలలో అన్యాయం చేస్తున్నారని కృష్ణయ్య విమర్శించారు.
ఉద్యోగ  రంగంలో బిసి లకు జాతీయ స్థాయిలో 12 శాతo, రాజకీయ రంగం లో 14 శాతం, పారిశ్రామిక, కాంట్రాక్ట్,కార్పోరేట్ రంగంలో  1 శాతం కూడా ప్రాతినిధ్యం లేదు. 71 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత 56 శాతం జనాభ గల బిసి.లకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉంటే, ఇదెలా ప్రజస్వామ్యం అవుతుందని ప్రశ్నిచారు. బిసిలను అన్ని రంగాలలో అణచి వేస్తున్నారని, అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈ బహిరంగ సభను రాజకీయాలకతితంగా జరుపాలని నిర్ణయించారు. ఈ సభకు ప్రతి బిసి కదలిరావాలని కృష్ణయ్య విజ్ఞప్తి చేసారు.
Tags:50% reservation in the legislative body for BCs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *