Natyam ad

పుంగనూరులో ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలకు 500 మంది హాజరు

పుంగనూరు ముచ్చట్లు:

దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 3న జరగనున్న ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షల కోసం విద్యార్థులకు ముందుగా మోడల్‌ పరీక్షలను నిర్వహించారు. ఆదివారం స్థానిక బసవరాజ ప్రభుత్వ కళాశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మోడల్‌ పరీక్షలు నిర్వహించారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన ఐదు మండలాల విద్యార్థులు సుమారు 500 మంది పరీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు ఉమాశంకర్‌రెడ్డి మాట్లాడుతూ పరీక్షలకు శిక్షణలో భాగంగా మోడల్‌ పరీక్షలు నిర్వహించి , పరీక్షలు సులభంగా ఉండేందుకు అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమరనాథరెడ్డి, ధనుంజయచారి, వేణుగోపాల్‌, చంద్రశేఖర్‌రెడ్డి, వీరరాజారెడ్డి, మహమ్మద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: 500 people appeared for NMMS exams in Punganur

Post Midle