ఆన్ లైన్ లో   52,748 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల

52,748 Shriwari Arjita Seva tickets released online

52,748 Shriwari Arjita Seva tickets released online

Date:06/12/2019

తిరుమల ముచ్చట్లు:

శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2020, మార్చి నెల కోటాలో మొత్తం 52,748 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో  అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. ఆన్లైన్ డిప్ విధానంలో 10,973 సేవా టికెట్లు కాగా, ఇందులో సుప్రభాతం 8,193, తోమాల 120, అర్చన 120, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాదదర్శనం 2,300 టికెట్లు ఉన్నాయన్నారు. ఆన్లైన్ జనరల్ కేటగిరిలో 41,775 సేవాటికెట్లు ఉండగా, వీటిలో కల్యాణం 14,250, ఊంజల్సేవ 4,500, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,425, సహస్రదీపాలంకారసేవ 15,600 టికెట్లు ఉన్నాయని వివరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

 

అంబేద్కర్ కు ఘన నివాళులు

 

Tags:52,748 Shriwari Arjita Seva tickets released online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *